https://epaper.netidhatri.com/
`కరీంనగర్ వెలుగులు గంగులతోనే…
`ప్రగతికి కరీంనగర్ చిరునామా చేసింది గంగులనే.
`కరీంనగర్ ను సుందరవనం చేసింది గంగులనే…
`ఐటి టవర్ తెచ్చింది గంగులే…
`వేలాడే వంతెనతో అందాలు అద్దింది గంగులే..
`రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది గంగులే..
`ఆపన్నులను ఆదుకున్నది గంగులే…
`కరోనా కాలంలో ప్రాణాలు పోసింది గంగులే…
`బండి కనీసం జనంలో తిరిగింది లేదు…
`సమాజాన్ని చీల్చడం తప్ప స్నేహం పంచింది లేదు.
`పార్లమెంటుకు పంపిస్తే బండి నిధులు తెచ్చింది లేదు.
`కరీంనగర్ కు మేలు చేసింది లేదు.
`రాజకీయాలు తప్ప, గెలిపించిన ప్రజలకు మేలు చేసింది లేదు.
`ప్రజలకు అందుబాటులో వుండి ఆదుకున్నది లేదు.
`పార్టీకి పనికిరాని బండి..ప్రజలకు పనికొస్తాడా!?
`పార్టీ పక్కన పెట్టిన బండి…ప్రజలకు సేవ చేస్తాడా?
`కరీంనగర్ కు చేసిన మేలు ఒక్కటీ లేదు!
`బండి చేసింది గుండుసున్నా?
హైదరాబాద్,నేటిధాత్రి:
కరీంనగర్ నియోకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్‌కు తిరుగులేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్ ముందు బిజేపి. అభ్యర్ధి బండి సంజయ్‌కు అంత బలం లేదు. ఎన్నికల్లో గెలిచేది లేదని అంటున్నారు. అయినా సరే కరీంనగర్ శాసనసభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ముగ్గురు ఒకే సామాజిక వర్గ నేతలు కావడం మరో విశేషం. అయితే వరుసగా మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఇప్పటికే బండి సంజయ్ రెండు సార్లు వరసగా ఓడిపోయాడు. ఇప్పుడు మూడోసారి ఓడిపోవడానికి సిద్దంగా వున్నడని అంటున్నారు. మొత్తం మీద బండి సంజయ్ మీద బిఆర్‌ఎస్ అభ్యర్ధి గంగుల మూడోసారి కరీంనగర్ నుంచి పోటీ చేసి హాట్రిక్ సాధించనున్నాడని అంటున్నారు. అంతగా గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజల జీవితాలలో ఆయన రాజకీయ అనుబంధం పెనవేసుకుపోయింది. ముచ్చటగా మూడోసారి గంగుల మీద ఓడిపోవాలని సంజయ్‌కు రాసివుందంటున్నారు. నిజానికి బిజేపి అగ్రనేతలు తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ముందు బండి సంజయ్ కూడా పోటీ చేయకపోవచ్చన్న వార్తలు వినిపించాయి. అయితే బండి సంజయ్ భయపడుతున్నాడన్న చర్చ జోరుగా సాగింది. దాంతో పారిపోయిండు అన్న అపవాదు కన్నా, పోరాడి ఓడిపోయిండన్న పేరు వుంటుందని ఎన్నికల బరిలో నిల్చున్నాడు. ఓడిపోతానని ఆయనకు కూడా తెలుసు. అంతే కాదు గత ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచాడు. ఇది ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పుతుందని అందరూ అనుకున్నారు. కాని అదే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతుందని ఊహించలేదు. పార్లమెంటు సభ్యుడు అయిన కొద్ది కాలానికే బండి సంజయ్ తెలంగాణ బిజేపి శాఖకు అద్యక్షుడయ్యాడు. కరీంనగర్‌కు దూరమయ్యాడు. పాదయాత్రలు చేశాడు. కాని కరీంనగర్ ప్రజలను కలుసుకోలేకపోయాడు. తెలంగాణ అంతటా తిరిగాడు. కాని కరీంనగర్ గల్లీలు తిరిగి ప్రజలకు తోడుగా నిలవలేదు. తెలంగాణ రాజకీయాలలో కీలకమనుకున్నాడు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పక్కన పెట్టేలా చేసుకున్నాడు. ఇదంతా ఆయన చేసుకున్న స్వయం కృతాపరధామే అని చెప్పాలి. ఇక పార్లమెంటు సభ్యుడినైనా బండి సంజయ్ కరీంనగర్‌కు ఏమైనా చేశాడా? అంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. చూపించుకుందామనుకున్నా ఒక్కటీ లేదు. రైల్లే ఫ్లైఓవర్ నేనే తెచ్చాను అంటూ ఇప్పుడు కొత్త కథలు చెబుతున్నాడు. కాని ఆ ప్రతిపాదన యూపిఏ హయాంలో జరిగింది. పొన్నం ప్రభాకర్ ఎంపిగా వున్న సమంయలో ప్రతిపాదన వుంది. తర్వాత వినోద్‌కుమార్ ఎంపిగా వున్నప్పుడు దానికి అడుగులుపడ్డాయి. అంతే గాని రైల్వే బ్రిడ్జ్ సాదనలో బండి సంజయ్ పాత్రలేదు. కాకపోతే ఆయన ఎంపిగా వున్న సమయంలో పరిపాలన అనుమతులు రావడం బండి సంజయ్ గొప్పదనం కాదు. ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పినట్లు పరాయి వాళ్ల పిల్లలను తమ పిల్లలు అని చెప్పుకుంటారు. ఇక బండి సంజయ్ కోతలకు అంతూపొంతు వుండడం లేదు. అబద్దాలకు హద్దూ బద్దూ వుండడం లేదు. కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడిగా ఒక్క రూపాయి తేలేదని ఆరోపిస్తుంటే, నేను రూ.8వేల కోట్ల రూపాయలు తెచ్చానని పచ్చి అబద్దాలు చెబితే ప్రజలు నమ్ముతారా? బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడు అయిన కొద్ది కాలానికే కరోనా విపత్తుతో దేశమంతా అల్లకల్లోలమైంది. ప్రపంచమే తలకిందులైంది. ఇప్పటికీ ప్రపంచమేకోలుకోలేకపోతోంది. మరి బండి సంజయ్ రూ.8వేల కోట్లు తెచ్చి ఏం పనులు చేశాడా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నాడు. నిజాలు చెప్పినా ప్రజలు వింటారు. గాని లేని పోని అబద్దాలు చెబితే ప్రజలు ఇక ఎప్పుడూ నమ్మరు. పార్లమెంటు సభ్యుడైన తర్వాత అన్ని నిధులు తెస్తే ఏనాడైనా మీడియా ముఖంగా వెల్లడిరచిన దాఖలాలున్నాయా? ఇలా ఎన్నికల వేళ బండి సంజయ్ అబద్దాల మీద అబద్దాలు చెబుతుంటే ప్రజలు ఎక్కడిక్కడ నిలదీశారు. దాంతో తెలంగాణలో జరిగిన అభివృద్ది అంతా కేంద్రమే ఇస్తుందని మాట మార్చారు. లింకు రోడ్లంటాడు. రేషన్ బియ్యం కేంద్రానివే అంటాడు. తెలంగాణలో రేషన్‌కార్డులు కొత్తవి ఇవ్వడం లేదంటాడు. రేషన్‌కార్డుల జారీ అనేది కేంద్రం పరిధిలో వుండేదన్న సోయి కూడా లేకుండా మాట్లాడుతుంటాడు. వైకుంఠ దామాల నిర్మాణం కేంద్రం సొమ్మే అంటాడు. రైతు వేధికలు కేంద్రం డబ్బులే అంటాడు. మరి కరీంనగర్‌కు ఏం తెచ్చావంటే అందులో నుంచే కరీంనగర్‌కు పైకమొచ్చిందని చెబుతున్నాడు. దాంతో బండి సంజయ్ మాటలను విని ప్రజలు నవ్వుకుంటున్నారు.
పార్టీకే బండి సంజయ్ పనితీరు నచ్చలేదు.
ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వంలో గిచ్చి కయ్యం పెట్టుకోవడంతోపాటు, సమాజంలో చిచ్చు పెట్టే ప్రకటనలు చేయడాన్ని కేంద్రం సహించలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇలా మాట్లాడే పార్టీ నుంచి సాగనంపేలా చేసుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ హిందూ ముస్లింల ప్రస్తావన, శవం, శివం అంటూ చెప్పిన లెక్కలు తెలంగాణ సమాజానికి నచ్చలేదు. బిజేపి నాయకులకే బండి సంజయ్ మాటలు ఒప్పుకోలేదు. బండి సంజయ్ వల్లపార్టీకి ఈమాత్రం వున్న ఇమేజ్ కూడా తెలంగాణలో పోయే ప్రమదముందని తేల్చి చెప్పారు. బండిని దించేశారు. నిజానికి ఏపార్టీ అయినా ఎన్నికల ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చే ప్రయత్నం చేయదు. కాని బండి సంజయ్ వల్ల రాష్ట్రం రాజకీయాలు కలుషితమౌతాయని ఆ పార్టీ గ్రహించింది. ఆయనను పక్కనపెట్టింది. అయినా ఆయనలో మార్పు కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్న విపరీత వ్యాఖ్యలు జనానికి నచ్చడం లేదు. కరీంనగర్ యువత గంజాయి మత్తులో తూగుతున్నారంటూ బండి చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం వచ్చేలా వున్నాయి. ఓ వైపు ఆయనపైనే తంబాకు అన్న అపవాదు వుంది. అలాంటి బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. అంతే కాకుండా బాధ్యత కల్గిన ఎంపి తన ఇలాఖాలో గంజాయి అమ్మకాలు సాగుతుంటే ఇంత కాలం ఏం చేసినట్లు? స్వయంగా ఆయన కూడా పట్టింపజేయొచ్చు. పోలీసులకు సమచారమందించి వారిని పట్టుకునేలా చేయొచ్చు. కాని ఇప్పటి వరకు ఏనాడు అలాంటి విషయాలు చెప్పకుండా, కరీంనగర్ యువతను మత్తుకు బానిసలు అని అనడం వారి మనోభావాలను దెబ్బతీయడం కాదా? వారి ఆత్మగౌరవానికి చేటు కాదా? ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడడం బండికి అలావాటు. అబాసుపాలు కావడం బండికికొత్త కాదు.
కరీంనగర్ అభివృద్ది విషయంలో గంగుల కమలాకర్ చూపిన చొరవ అంతా అంతా ఇంతా కాదు.
వరసుగా 2009, 2014,2018 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. హాట్రిక్‌విజయాన్ని అందుకున్నారు. బండి సంజయ్‌ను ఇప్పటికే రెండు సార్లు ఓడిరచాడు. మూడోసారి కూడా బండి మీద గెలిచి అలా కూడా హాట్రిక్ కొట్టాలని గంగుల కమలాకర్ చూస్తున్నాడు. మంత్రిగా కరీంనగర్ అభివృద్దికి గంగుల ఎంతో కృషి చేశారు. ఆయన ఎమ్మెల్యేగా కరీంనగర్ అభివృద్దిలో తనదైన ముద్ర వేస్తూనే వస్తున్నారు. మంత్రిగా అంతకు రెట్టింపు ప్రగతిని కరీంనగర్‌లో చూపించారు. కరీంనగర్‌ను అందమైన నరగరంగా తీర్చిదిద్దారు. మానేరు డ్యాం ముందు నగరంలోనే సుందరమైన వనం ఏర్పాటు చేశాడు. కరీంనగర్‌కు కొత్త అందాలను తెచ్చాడు. ప్రకృతి రమణీయతను పెంచాడు. పచ్చదనం వెల్లివిరిసేలా చేశాడు. కరీంనగర్‌కు వేలాడే వంతెన తెచ్చి, కరీంనగర్‌కే కొత్త అందాలు అద్దిన ఘణన సాధించాడు. ఐటి టవర్ తెచ్చి, కరీంనగర్ యువతకు స్దానికంగానే ఉద్యోగ, ఉపాధి కల్పనతో వారి జీవితాలలో వెలుగులు నింపాడు. ఆపన్నులను ఆదుకోవడంలో గంగుల ముందుంటారు. కరోనా కాలంలో కరీంనగర్ ప్రజలకు ఎనలేని సేవ చేశాడు. కరోనా బారిన పడిన ప్రజలకు ఇతోదిక సాయం చేశాడు. వారికి వైద్యం అందించాడు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాడు. అలా కరీంనగర్ ప్రజలకు సేవలందించిన గంగులను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెబుతున్నారు.