నిజమైన దమ్మున్న చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మిని సన్మానించిన కౌన్సిలర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం మున్సిపాలిటీ మున్సిపల్ చైర్ పర్సన్ గా అవిశ్వాసంలో నెగ్గి మొదటిసారి మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మిని మున్సిపల్ కార్యాలయం చైర్పర్సన్ సాంబార్లో కౌన్సిలర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించి కేకు కటింగ్ చేసి గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ న్యాయం వైపు కౌన్సిలర్లు నిలబడ్డారని దాని ఫలితంగానే అవిశ్వాసంలో నెగ్గి మరల చైర్పర్సన్ గా ఈరోజు కార్యాలయానికి రావడం జరిగిందని సహకరించిన ప్రతి కౌన్సిలర్ కి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికారము డబ్బు ఉంటే చాలు అనే అహంకారం తో ఏదైనా చేయవచ్చని అనుకున్న వారికి తగిన గుణపాఠం ఈ అవిశ్వాస తీర్మానం అని మంచి చేసిన వారికి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడని ప్రజల అవసరాలను తీరుస్తూ కొత్తగూడెం మున్సిపాలిటీ నీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చైర్పర్సన్ కి అండగా ప్రజలచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ గా మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని దీనివల్ల వార్డులలో మా గౌరవం రెట్టింపు అయిందని డబ్బు ఈరోజు ఉంటుంది కానీ విలువలు అనేవి జీవితంలో ముఖ్యమని కొత్తగూడెం మున్సిపాలిటీకి ఎన్నో అవార్డులు తీసుకొచ్చిన ఘనత ఒక చైర్ పర్సన్ గా కాపు సీతాలక్ష్మికి మాత్రమే ఉందని అటువంటి వారి నాయకత్వంలో మేము ఉండడం వారికి మద్దతుగా నిలవడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!