పాలమూరు జిల్లాలో కమలం జోరు

బిజెపి ప్రచార హోరు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ రూరల్ మండలంలో కమలం జోరుగా ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం, చిన్న దర్పల్లి, నాయినాని పల్లిలలో బీజేపి లోకసభ ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ అడుగడుగునా డప్పు చప్పుళ్ళు, మహిళల నృత్యాలు, జై బీజేపీ నినాదాలతో అరుణమ్మకు అడుగడుగినా నిరాజనాలు పలికిన గ్రామస్థులు, బీజేపీ శ్రేణులు
వెంకటాపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అరుణమ్మ. స్థానికులు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అరుణమ్మ కామెంట్స్..

రేవంత్ రెడ్డి మోదీ కాలి గోటికి సరిపోడు

ఫ్రీ బస్ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నా..

ఫ్రీ బస్సు పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోంది

మహిళల మధ్య గొడవలు పెట్టకుండా చిత్తశుద్ధి ఉంటే మహిళల కు స్పెషల్ బస్సు వేయాలి

ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేక పోతోంది
– రైతుబందు ఇస్తామన్నారు ఇచ్చారా.? ఇవ్వలేదు.
– రుణ మాఫీ ఇవ్వలేదు
– మహిళలకు భృతి ఇవ్వలేదు ఇచ్చిన మాట నిలుపుకొని రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు

కానీ మోదీ మాట ఇస్తే అమలు చేసి తీరుతాడు.

– అయోధ్యలో రామ మందిరం కట్టించాం
– నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం
– కరోనా కష్టం కాలం లో ఆదుకున్నాం
– ఉచితంగా వాక్సిన్ ఇచ్చాము

మరి ఇన్ని ఇచ్చిన మోదికి ఓటు వేసి ఋణం తీర్చుకోవాలి.

ఇక్కడ అరుణమ్మ అక్కడ మోదీ గెలుస్తుంది అని కాంగ్రెస్ బేదిరింపులకు దిగుతోంది.

ఇక్కడ అరుణమ్మ ఉంటే వీళ్లకు ఎందుకంత భయం.. నిజాలు మాట్లాడుతదనా.

జుటా మాటలు చెప్పి… అరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చింది రేవంత్ సర్కార్..

అరుణమ్మ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

ఇలాంటి సన్యాసులకు కొంచమైనా సిగ్గుండాలి..

దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి..

ఆనాడు అరుణమ్మపై కుట్రలు చేసిండు ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి జైపాల్ రెడ్డి..

ఇప్పుడు వాళ్ల అల్లుడు రేవంత్ కుట్రలు చేస్తున్నారు.

కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూన్న కాండిడేట్ కు ఈ ఊరు తెల్వదు.. ఇక్కడి సమస్యలు తెలియవు..

కానీ ఈయన వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తాడంట..

కల్వకుర్తి నుంచి వచ్చి వాళ్లు రాజకీయాలు చేయుచ్చు కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మనమిక్కడ పోటీ చేయొద్దు అంట.

ఉన్న ఊరిని బాగు చేయనోడు మన ఊరిని ఎలా బాగు చేస్తాడు..

ఒక ఆడబిడ్డపై కుట్రలు క్యూస్తున్న సన్యాసులకు సిగ్గు ఉండాలి.

ఒక అడబిడ్డకు విలువ ఇవ్వనోడు మనిషే కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!