భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం తరగతుల బోధనలో భాగంగా కడవరిక్ ఒత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెడికల్ కళాశాల నూతన విద్యార్థుల కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా రెండు మృతదేహాలను తెప్పించారు. సంబంధిత మృతదేహాలను మృతి చెందిన వ్యక్తి వారి కుటుంబ సభ్యుల గత ఒప్పందం మేరకు మెడికల్ కళాశాల విద్యార్థుల పరిశోధనకు వినియోగించుకునేందుకు అప్పగిస్తారు ఈ క్రమంలో మెడికల్ విద్యా బోధనలో భాగంగా మృతదేహంతో మెడికల్ కళాశాల విద్యార్థులు సాంప్రదాయ బద్దంగా ప్రతిజ్ఞ చేసి బోధనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మెడికల్ కళాశాలలోనూ కడ వారిక్ ఒత్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ దేవుడే, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.