
స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని
తనేదారపల్లి గ్రామం లో సోమవారం రోజు జనగామ జిల్లా రూరల్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బెలిదె వెంకన్న ఆద్వర్యంలో కడియం శ్రీహరి ఎన్నికల ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వాల్ పోస్టర్లను గ్రామంలో ప్రతి గడపగడపకు వీధి వీధిన అంటించాలని నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా కడియం శ్రీహరికి లక్ష మెజార్టీ ఇచ్చే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాదె చంద్రయ్య. మార్కెట్ వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి దుంపల పద్మారెడ్డి మాచర్ల కుమారస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు కాంసానే రాజు ఉడుత బిక్షపతి మాచర్ల మొగిలి మాచర్ల రాజు ఆకుల మల్లయ్య ఆకుల శ్రీను ఆకుల సుదర్శన్ గాదే సుధాకర్ గజ్వేల్లి దయాకర్ ప్రభాకర్ ఆకుల చంద్రమౌళి సోమోజీ రాజు, తదితరులు పాల్గొన్నారు.