కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు
1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 1బి దళితులకు ఉన్నా, వీరే సర్వహక్కులు కలిగి ఉన్నా, కేవలం ఓ బయానపత్రం, ఆర్‌ఓఆర్‌లను దస్తావేజులుగా చూపుతూ కొంతమంది కబ్జాదారులు బయలుదేరారు. భూమిని కబ్జా చేశారు. దళితులు లబోదిబోమన్నారు. భూకబ్జాదారుతోపాటు ఓ మహిళ సీఐ వేధింపులు భూయజమానులైన దళితులకు రోజురోజుకు పెరిగిపోయాయి. అన్ని హక్కులు, కావల్సిన దస్తావేజులు, కోర్టు ఆర్డర్లు ఉన్నా కబ్జాదారులకే ఆ మహిళా సీఐ వంత పాడుతోంది. కబ్జాదారులు అక్రమంగా భూమిలోకి ప్రవేశిస్తే సీఐ దగ్గరుండి రక్షణ కలిపిస్తోంది. దళితులను రాత్రి వరకు ఆడ, మగా తేడా లేకుండా స్టేషన్‌లో నిర్బందించి బూతులు తిడుతూ నానాహంగామా సృష్టించిందట. కోర్టు ఆర్డర్లు, భూమి దస్తావేజులతో తనకు పని లేదు. తాను చెప్పిందే వేదం. తాను చెప్పిందే తీర్పు. తానే కోర్టు అన్నట్లుగా భూమి వదిలివెళ్లండని దళితులకు ఆ మహిళా సీఐ హుకుం జారీ చేస్తోందట.
పూర్తి వివరాలు రేపటి సంచికలో…