భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం మున్సిపాలిటీ కే. ఎన్. ఆర్ పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పార్థ సారథి మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఉత్తేజం కలుగుతుంది అని తెలియచేశారు. దీనిలో భాగంగా క్రికెట్, కబడ్డీ, కో కో, లాంగ్ జంప్, రన్నింగ్ పోటీలను నిర్వహించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విద్యార్ది విద్యార్థినిలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.