కూకట్పల్లి,ఏప్రిల్ 11 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్రాంత డిప్యూటీ రిజిస్టార్ శ్రీ యంపరాల సాంబశివరావు ముఖ్య అతిధులుగా విచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లర్పించారు.ఈ సందర్భముగా యంప రాల సాంబశివరావు మాట్లాడుతూ…..మ హాత్మ జ్యోతిరావు పూలే నవయుగ వైతా ళికుడుగా,సంఘసంస్కర్తగా,సామాజికతత్వవేత్తగా,బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతిగా,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషిచేసారని,కుల వివక్షకు వ్యతిరే కంగా పోరాడిన ధీశాలి అని,కుల వివక్ష,పితృ స్వామ్య భావజాలానికి వ్య తిరేకంగా పోరాటం చేసి,బాలిక విద్య,స్త్రీ హక్కులు,వితంతుల పునర్వివాహానికి కృషి చేసి.. బల హీన వర్గాల సామాజిక న్యాయం, సాధికారతకు పరితపించిన గొప్ప సాంఘిక విప్లవకారుడు మహాత్మా శ్రీ జ్యోతిరావు గోవిందరావు ఫూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమములో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగ
రావు,కొల్లా శంకర్,వెంకట్రావు,అత్తో ట శివరామకుమార్,ఐనంపూడి శివ సత్యన్నారాయణ,వాసిరెడ్డి లక్ష్మి న్నారా యణ, రఘురామ్,వడ్ల మూడి శ్రీనివాసరావు,బండా
రుపల్లి శ్రీనివాసరావు,కొండూరు నారాయణరాజు,ముప్పాళ్ల సాంబశి వరావు, సమ్మెట శివకృష్ణ,గౌతం
కాంబ్లే,దొరబాబు,సత్యనారాయణ రాజు,సుదర్శన్,శ్రీరాములు తదిత రులు పాల్గొన్నారు.