వనపర్తి నేటిధాత్రి:
చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీల గాను ఆరు ఎంపీ స్థానాలు మహిళలకు 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాలు మహిళలకు పోటీ చేయడానికి అవకాశం వస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా కార్యదర్శి మాజీ కౌన్సిలర్ నారాయణ దాస్ జ్యోతి రమణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు 370ఆర్టికల్ త్రిబుల్ తలాక్ బిల్లు ఆమోదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రివర్గానికి మహిళల తరఫున కృతజ్ఞతలు తెలిపారు