జర్నలిస్ట్ మంగళపెల్లి శ్రీనివాస్‌కు పితృవియోగం

జర్నలిస్ట్ మంగళపెల్లి శ్రీనివాస్ కు పితృవియోగం

*-మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిస్తున్న రిపోర్టర్ దుర్గం సురేష్ గౌడ్..
మొగుళ్లపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్, మాజీ ఉప సర్పంచ్ మంగళపెల్లి శ్రీనివాస్ కు పితృవియోగం జరిగింది. ఇటీవల ప్రమాదవశాత్తు మంగళపెల్లి శ్రీనివాస్ తండ్రి రాజయ్యను ఆటో ఢీకొట్టగా..ఆయనను హుజురాబాద్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ..శనివారం ఉదయం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని మొగుళ్ళపల్లికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న అక్షర విజేత భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దుర్గం సురేష్ గౌడ్, బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, ( తెలంగాణం రిపోర్టర్) వేముల మహేందర్ గౌడ్, మృతదేహాన్ని సందర్శించి..పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. మృతుడు రాజయ్యకు ఆత్మ శాంతి కలగాలని, ఆయనకు స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని వారు ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version