కొప్పుల క్రాంతి బిఆర్ఎస్ లో చేరిక

వరంగల్ తూర్పు బీజేపీ పార్టీకి బిగ్ షాక్

బీజేపీ నుండి బిఆర్ఎస్ లోకి భారీ ఎత్తున చేరికలు

నరేందర్ గెలుపుకై కదం తోక్కిన ఖిల్లా

ఎమ్మెల్యే నరేందర్ కు మద్దతుగా భారీగా తరలివచ్చిన ఖిలా వరంగల్ ప్రజానీకం

కారు గుర్తుకే మన ఓటు, జై నరేందర్ నినాదాలతో దద్దరిల్లిన ఖిలా కోట

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పు పరిధి, ఖిలా వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పుచ్చుకున్న ఖిలావరంగల్ దివంగత మాజీ కార్పొరేటర్ కొప్పుల శ్రీను కుటుంబ సభ్యులు, వారి అనుచరులు భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కొప్పుల క్రాంతి చేరికతో ఖిలావరంగల్ మొత్తం గులాబీమయం అయింది. ఈ సందర్భంగా అగర్తల రోడ్డుకు ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన కొప్పుల క్రాంతి, పద్మ, ఆకుల వెంకటేశ్వర్లు, సుంకరి రాజు, బోనగోరి నరేష్, రంజిత్,బొల్లం తిలక్, హరిప్రసాద్, హరీష్ తో పాటు సుమారు 80కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపనేని మాట్లాడుతూ, 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 55సంవత్సరాలు కాంగ్రెస్ పాలకులు పరిపాలించారు. 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు, వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి నోచుకోకోకుండా చేశారని తెలిపారు. వరంగల్ కు ఆసరాగా ఉన్న అజంజాహి మిల్స్ కాంగ్రెస్ అమ్ముకుని, మనకు ఉపాది లేకుండా చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి మూడు కంపెనీలు నెలకొల్పి, మన నియోజకవర్గానికి 10వేల ఉద్యోగాలు వచ్చేలా చేశారని అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలకు అండగా మేనిఫెస్టో లో ఆసరా పెన్షన్ 2వేల నుండి 5వేలకు, వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంచుతున్నాం అని, సౌభాగ్యాలక్ష్మీ ద్వారా 3వేల రూపాయలు మహిళలకు అందిస్తాం. రైతులకు రైతుబంధు 16000వేలకు పెంచుతున్నాం అని, ఆరోగ్యశ్రీ ద్వారా 15లక్షల వైద్యం చేసుకునే వేసులు బాటు ఉంటుందని, గ్యాస్ 400వందలకు అందిస్తాం అని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా అందిస్తాం అని, ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇలా అన్ని వర్గాలకు కేసీఆర్ చేయూత అందించే విదంగా మేనిఫెస్టో రూపొందించారు అని అన్నారు. మన భవిష్యత్తు కోసం కలెక్టరేట్, బస్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇన్నర్ రింగ్ రోడ్, 7గురుకుల పాఠశాలలు, 24అంతస్తుల హాస్పిటల్ ఇలా మరెన్నో అభివృద్ధి పనులు చేసాను అని, 11సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు ఖిలా వరంగల్ లో విద్య, వైద్యం మంచినీళ్లు, కమ్యూనిటీ హాల్స్, రోడ్లు, మోరీలు, గతపాలకులు ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు. తెలంగాణ సాదించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన ఒక ఉద్యమ బిడ్డలు ఎమ్మెల్యే, కార్పొరేటర్లు అయ్యారు అని, ఇప్పుడు వచ్చే నాయకులు ఆగార్తల రోడ్డు మేము పోసినం అని చెప్పుకుంటుర్రట, మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ అని చెప్పుకునేందుకు వారికే విజ్ఞత ఉండాలి అని అన్నారు. కూరగాయలు మార్కెట్ లో మన ఖిలావరంగల్ కూరగాయలు అమ్మకునే వారికి అవకాశం కల్పించానని, ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే మన బిడ్డలు ఉద్యోగం సంపాదించాలని 110రోజుల పాటు కోచింగ్, భోజనం, మెటీరియల్ అందించాం అని అన్నారు. కరోనా కష్టకాలంలో 25వేళ మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, బెడ్స్, ఇంజెక్షన్స్ అందించాం అని అన్నారు. కరోనా కష్టకాలంలో కనిపించని నాయకులు నేడు ఓట్లకోసం వస్తున్నారు మరి ఇన్నేండ్లు వీల్లు ఎక్కడ పోయారు అని అన్నారు. నేను ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన బిడ్డను అని, 500వందల నౌకరితో ప్రారంభం అయిన నా జీవితం నేడు కష్టపడి ఎమ్మెల్యే స్థాయికి ఎదగాను అని అన్నారు. నేను లోకల్ వాళ్లు నాన్ లోకల్ అని, ఒకరు వంచనగిరి, మరొకరు వర్ధన్నపేట నుండి వచ్చిన వాళ్ళు, వాళ్లకు మన బాధ ఎట్లా తెలుస్తది అని అన్నారు. అందుకే నన్ను ఎన్నుకోండి. అండర్ బ్రిడ్జి దగ్గర అందుబాటులో ఉంట అని, పడమర మధ్య కోటలో కావాల్సిన అభివృద్ధి చేశాను, వాటర్ ట్యాంక్ ఏర్పాటు మిగిలి ఉంది అది కూడా పూర్తి చేస్తా అని అన్నారు. పాస్ పుస్తకాల సమస్య ఉంది ఎన్నికలు అవ్వగానే ఒక్కరూపాయి ఖర్చు లేకుండా వారందరికి పాస్ పుస్తకాలు అంధించే దిశగా సాగుతాం అని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తాం అని తెలిపారు.
41 గుడిసె సెంటర్లో గొప్పగా అభివృద్ధి చేసి పట్టాలను అందిస్తున్నాం అని, రింగ్ రోడ్డు చుట్టూ కంపెనీలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు ఉపాది దొరికే విదంగా చూస్తాము అని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి నాకు భారీ మెజారిటీ అందించండి మరింత అభివృద్ధి చేస్తాను అని నరేందర్ తూర్పు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, మహిళ నాయకురాలు తోట స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *