నెక్కొండ, నేటిధాత్రి:
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అంటూ బడిబాట కార్యక్రమంలో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొమురవెల్లి వెంకటేశ్వర్లు, పి శ్రీధర్ లు గ్రామంలో విద్యార్థిని ,విద్యార్థులతో, ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చదివిస్తే( చేర్పిస్తే) కలిగే ప్రయోజనాలను వివరించారు .ప్రతి కుటుంబాం దగ్గరకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి తల్లిదండ్రులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాను బోధించే ఉపాధ్యాయులు ప్రభుత్వ శిక్షణ పొంది ఉన్నారని వారి బోధన సక్రమంగా ఉంటుందని ప్రభుత్వం మే పాఠ్య పుస్తకాలు, పాఠశాల దుస్తులు, అందిస్తూ అల్పాహారం ,మధ్యాహ్న భోజనం ,కూడా అందిస్తుందని ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఫలితాలు అందిస్తున్నాయని ఇది జగమెరిగిన సత్యం అని ఆయన గుర్తు చేశారు.