BMS Ensures Job Security for Singareni Workers
సింగరేణి కార్మికుల ఉద్యోగ భద్రత బిఎంఎస్ తోనే సాధ్యం.
బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ జీ అన్నారు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఆఫీసు బ్రాంచి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ జీ
హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, తెలిపారు.
ఈ పోరాటం జాతీయ నాయకులు శ్రీ కొత్తకాపు లక్ష్మారెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ మారినప్పటికీ పాత కార్మికులను కొనసాగించాలనే నిబంధనను యాజమాన్యంతో అమలు చేయించగలిగింది (బీఎంఎస్) మాత్రమేనని తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికులకు ఐఎంఈ పి.ఎం.ఇ ₹2,500 చెల్లింపు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపు, బోనస్ అమలు, సెక్యూరిటీ గార్డులకు కాఖీ యూనిఫాం అమలు వంటి అనేక సాధనాలు బీఎంఎస్ కృషితోనే సాధ్యమయ్యాయని రామ్ మోహన్ జీ పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం పోరాట తీర్మానాలు.
కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో తక్షణమే అమలు చేయాలి.
కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులకు కోల్ ఇండియా విధానంలో వైద్య సౌకర్యం కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికులకు నివాస క్వార్టర్లు వారి పిల్లలకు విద్యా సౌకర్యాలు అందించాలి.
సింగరేణి కార్మికులకు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగరేణి గుర్తింపు ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏఐటియుసి ఐఎన్ టియుసి కార్మిక సంఘాలు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి పైరవీలకు పరిమితమై కార్మికులను మోసం చేశాయి.
ఈ కార్యక్రమంలో అప్పాని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి సుజేందర్ బ్రాంచి ఉపాధ్యక్షులు నర్సింగరావు బ్రాంచి కార్యదర్శి రఘుపతి రెడ్డి తోపాటు పని రమేష్ రవికుమార్ కడారి శంకర్ అన్నం శ్రీనివాస్ సదానందం ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా శ్రీ.కొత్తూరి మల్లేష్ పొట్టి శ్రీరాములు భాస్కర్ రాజు భగవాన్ పవన్ పునీత్ రావు శీలం రాజు నాగుల రాజయ్య పిట్ సెక్రెటరీలు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.
