మహాదేవపూర్- నేటి ధాత్రి:
తాడిచెట్టు పైనుండి పడి విన్నుపూస విరిగి మంచానికి పరిమితమైన గీత కార్మికుడు గుర్రపు గట్టయ్య కు జయశంకర్ ఫౌండేషన్ చేయూతను అందించింది.
శనివారం రోజు జిల్లాలోని చిట్యాల మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు గట్టయ్య తాడి చెట్టు పైనుండి పడి వెన్నుముక్క విరిగిపోవడంతో మంచానికి పరిమితమై కుటుంబ పోషణకు ఇబ్బందిగా పరిస్థితి మీకు తెలుసుకున్న ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి గట్టయ్య కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి, గీత కార్మికుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫౌండేషన్ మండల ఇన్చార్జ్ రాజయ్య జిల్లా కన్వీనర్ లు ఉన్నారు.