జయహో.. నిత్య జనగణమన

జనగణమన పరిశీలనకు వచ్చిన కర్ణాటక వాసులు
జమ్మికుంట: నేటిధాత్రి

జమ్మికుంట పట్టణంలో 2017 ఆగస్టు 15వ తేదీన అప్పటి సీఐ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్య జనగణమన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా అమలులోకి తీసుకొని వచ్చారు. భారతదేశంలో హర్యానాలోని ఈస్సార్ తర్వాత తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ప్రారంభమైంది. జమ్మికుంట పట్టణంలోని ప్రధాన కూడల వద్ద మైకులను ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం ఎనిమిది గంటలకు ప్రతినిత్యం జనగణమన ప్రారంభమవుతుంది. జయహో నిత్య జనగణమన అంటూ పట్టణ ప్రజలతో పాటు వివిధ పనుల మీద వచ్చే ప్రజలు సైతం జనగణమన వచ్చే సమయానికి నిలబడి రెండు నిమిషాల పాటు జెండా వందనం చేయడం జరుగుతుంది. జమ్మికుంట పట్టణంలో జరుగుతున్న నిత్య జనగణమనను పరిశీలించేందుకు కర్ణాటకలోని బీదర్ కు చెందిన జైహింద్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశంలో హర్యానా తర్వాత జమ్మికుంట పట్టణంలోనే నిత్య జనగణమన పాడడం జరుగుతుందని ఇక్కడి ప్రజలందరూ జనగణమన వస్తున్న సమయంలో ఉన్నచోటనే నిలబడి సెల్యూట్ చేయడం జరుగుతుందని, ఇక్కడి ప్రజల దేశభక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమ రాష్ట్రంలో సైతం ఇదే తరహాలో నిత్య జనగణమన కొనసాగించేందుకు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఉప్పిన్, రామకృష్ణ మునిగల్ ,అరవింద్ కులకర్ణి, నిజ లింగప్ప తాగరే, గంగప్ప సావలే, రతన్ కమల్ తో పాటు జమ్మికుంట సీఐ రవి పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!