`దేశమంతా ఒకేసారి ఎన్నికల జాతరే?
`50 ఏళ్ల తర్వాత మళ్ళీ జమిలి ఎన్నికలు?

`ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో నిర్ణయం?
`ప్రతిపక్షాలు కూడా జమిలికి సన్నద్ధం?

`ప్రతిపక్షాలలో కూడా కనిపిస్తున్న ఉత్సాహం?
`అభ్యంతరం ఏదైనా వుంటే ఎన్ డి ఏ పక్షాళనుంచే వుండాలి?
`అయినా ప్రధాని మోడీ వినిపించుకుంటారన్న నమ్మకం లేదు?
`చంద్రబాబు, నితీష్ లు అభ్యంతరం పెట్టే అవకాశం?
`ప్రధాని మోడీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎవ్వరి మాట వినే రకం కాదు?
`ఏప్రిల్ నుంచి జన గణన మొదలు!
`మూడు నుంచి ఆరు నెలల్లో అంతా ఓ కొలిక్కి?
`ఆరు నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి?
`2027 నవంబర్ లో జమిలి ఎన్నికలు?
`బీజేపీ పార్టీ నేతలు చెబుతున్న మాట?
`ఈ మధ్య రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ జమిలి ఖాయమే అన్నారు?
హైదరాబాద్, నేటిధాత్రి:
జమిలీ ఎన్నికలు అసాద్యమైన ముచ్చటేమీ కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సార్లు జమిలీ ఎన్నికలు దేశంలో జరిగాయి. అంతే కాదు ఆ రోజుల్లో ఒకే రోజు ఎన్నికలు జరిగిన సందర్భాలు వున్నాయి. అయితే అప్పటి జనాభా వేరు. ఇప్పటి జనాభా వేరు. గణనీయంగా మన దేశ జనాభా పెరిగింది. 145 కోట్లకు చేరుకున్నది. దాంతో జమిలీ ఎన్నికల నిర్వహణ కొంత కష ్టసాద్యంగా మారుతుందన్న సందేహాలు కూడా వున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలే విడతల వారిగా మూడు నెలల పాటు కూడా జరుపుకుంటున్న సందర్భం చూస్తున్నాం. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఏక కాలంలో తేవడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కాకపోతే జమిలీ ఎన్నికలు ఏక కాలంలో చేపట్టినా, సమయం ఎంత తీసుకుంటుందన్నదికూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. సాదారణంగా రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలే రెండు మూడు విడతలుగా చేపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు అనేక విడతలుగా నెలల తరబడి నిర్వహిస్తున్నారు. ఇప్ప్పుడు జమిలీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించాలంటే కూడా సమయం ఎంత పడుతుందన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలే మూడు నెలల కాలం పాటు సాగితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిపితే ఎంత కాలం పడుతుందో అని ఆలోచిస్తున్నారు. ఇలా జమిలీని కూడా విడతలవారిగా కాలం సాగదీస్తూ నిర్వహించడం వల్ల ప్రజల ఆలోచనలు మారే అవకాశం కూడా వుంది. పాలÅ£పక్షాలకు అనుకూలమయ్యే అంశాలు కూడా వుంటాయంటున్నారు. ఏది ఏమైనా మరోసారి జమిలీ ఎన్నికల చర్చ తెరమీదకు వచ్చింది. ఈ పార్లమెంటు సమావేశాలలోనే ఆ నిర్ణయం తీసుకుంటారనే వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి జమిలీ మీద 2019 నుంచి ప్రతి ఆరు నెలలకోసారి చర్చకు రావడం చూస్తూనే వున్నాయి. ఇప్ప్పుడు మళ్లీ జాతీయస్దాయిలో చర్చ మొదలైంది. బీహార్ ఎన్నికల్లో బిజేపి గెలుపు తర్వాత ఈ చర్చకు ఊపు వచ్చింది. గతంలో 2034 తర్వాతే జమిలి అంటూ ప్రభుత్వం చెప్పింది. కాని పదే పదే జమలి ఎన్నికల ప్రస్తావన వచ్చేలా బిజేపి చేస్తోంది. 2027 నవంబర్ లోనే జమిలి ఎన్నికలు జరపాలని బిజేపి శ్రేణునలు బలంగా కోరుకుంటున్న ట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. జనాభా లెక్కలు ఈ ఏడాది ఎప్రిల్లో మొదలు కానున్నాయి. వాటిని సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలోపు పూర్తి చేయనున్నారు. ఆపై నియోజకవర్గాల పునర్విభజన కూడా ఆ వెంటనే పూర్తి చేస్తారని సమాచారం. ఆ తర్వాతే జమిలి అని గతంలో వినిపించింది. వాటి కంటే ముందే జమిలి పూర్తి చేయాలని బిజేపి యోచిస్తోందని సమాచారం. ఇంకా ఆగితే దేశంలో బ్యాలెట్ ఎన్నికలు కావాలని ఉద్యమాలు వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే ఈవీఎం వల్ల తమకు నష్టం జరుగుతోందని ప్రతిపక్షాల ఆందోళన రోజు రోజుకు ఉదతం చేస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్‌పార్టీ ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకురావాలని అనుకుంటోంది. ఆది నుంచి బిజేపి కోరుకునే ప్రధాన ఎజెండాలలో కొన్ని పూర్తయ్యాయి. రామజన్మ భూమిలో గుడి కట్టేశారు. కశ్మీర్‌కు వున్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేశారు. దేశమంతా జిఎస్టీ ఒకే విదానం తెచ్చారు. ఇక మిగిలింది జమిలీ ఎన్నికలు. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు జమిలి ఎన్నికలు 2027లోనే జరిపే యోచన చేస్తున్నట్లు డిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఒక్కసారి అనుకుంటే తన హయాంలోనే జమిలీ చేపట్టాలని అనుకుంటారు. ఈ చర్చకు బలం చేకూరేలా ఆ మధ్య కాలంలోనే సిఎం.రేవంత్‌రెడ్డి కూడా ప్రస్తావించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి జమిలి ఎన్నిÅ£లు వుండొచ్చన్న సూటిగానే చెప్పారు. కాని ఆ రోజు మీడియా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. మీడియా దష్టి అంతా ఆ రోజు జూబ్లీ ఎన్నికల మీదే వుంది. ఆ ఎన్నికకు సంబందించిన వార్తలే ప్రసారం చేశాయి. సిఎం. రేవంత్ రెడ్డి నోట వినిపించిన ఆ మాటకు మీడియా పెద్దగా ప్రాదాన్యతనివ్వలేదు. ఈ మధ్య రాష్ట్రానికి చెందిన బిజేపి సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. ఈ మధ్య జరిగిన బిహార్ ఎన్నికల్లో బిజేపి విజయ దుందిబి మోగించింది. దాంతో మళ్లీ జాతీయ స్దాయిలో అప్పటి నుంచి చర్చ ఊపందుకున్నది. నిజానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. కాని కొన్ని అభ్యంతరాలు నేపధ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. గతంలో 2034 తర్వాతే జమిలి అంటూ చెప్పడం జరిగింది. కాని పదే పదే జమలి ఎన్నికల ప్రస్తావన వచ్చేలా మాత్రం చేస్తున్నారు.. 2027లోనే జమిలి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం బలంగానే కోరుకుంటున్నట్లుంది. అయితే జనాభా లెక్కలు 2027లో పూర్తి చేయాలి. ఆపై నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆ తర్వాతే జమిలి అని గతంలో చర్చ జరిగింది. కాని అవన్నీ పూర్తయ్యేదాక జమిలిని వాయిదా వేయకూడదని కేంద్రం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటి కంటే ముందే జమిలి పూర్తి చేయాలని బిజేపి యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాన సమస్యలు సషించే అవకాశం వుందని బిజేపి భావిస్తోంది. ఎందుకంటే జనాభా నియంత్రణలో దక్షిణాది ముందుంది. కాని ఉత్తరాదిలో మాత్రం జనాభా గణనీయంగా పెరిగింది. జనాబా ప్రాతిపదికన నియోజకర్గాల విభజన జరుగుతుంది. దాంతో దక్షిణాదిన చాలా సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది సీట్లు పెరుగుతాయి. అప్ప్పుడు దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనం మరింత పెరుగుతుంది. దీనిని భరించేందుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్దంగా లేవు. ఇక దేశమంతా పౌరులందరికీ ఒకే విదమైన హక్కులుండాలి. ఇక ఆఖరుకు మిగిలింది జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 400 సీట్లు సంపాదించుకోగలమని బిజేపి నమ్మకం. అందుకే ముందు జమిలీ ఎన్నికలు నిర్వహించి, మరోసారి కేంద్రంలో అదికారంలోకి రావాలని కోరుకుంటోంది. అదే జరిగితే దేశమంతా ఎన్నికల జాతరే అవుతుంది. జమిలీ ఎన్నికలు జరిగి మన దేశంలో సుమారు 50 సంవత్సరాలౌతోంది. అప్పటి నుంచి జమిలీ ఎన్నికల నిర్వహణ వీలు కాలేదు. ఎమర్జెన్సీ తీసుకొచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాల హక్కులను కాలరాసిందనే అపవాదు ఇప్పటికీ మోస్తూనే వుంది. మళ్లీ జమిలీ ఎన్నికల పేరుతో ఆ రోజుల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టి, మళ్లీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనేందుకు ధైర్యం చేయలేదు. కాని తమ హాయాంలో ఒక్కసారైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది బిజేపి ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోడీ ఆశయం. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లడానికి అన్నీ సమాయత్తం చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో బిజేపి అనుకున్నట్లుగా 400 సీట్లు వస్తే జమిలీ ఎన్నికలు 2034లోనే నిర్వహించేవారు. అంత పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే, మళ్లీ ఎన్నికలంటూ ప్రజల ముందుకు వెళ్తే బిజేపికి ఆశనిపాతమే ఎదురయ్యేది. కాని ఇప్ప్పుడు బిజేపి ఒంటరిగా కాకుండా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం ప్రధాని మోడీకి సుతారం ఇష్టం లేదని బిజేపి నేతలే అంటుంటారు. ఒక వేళ తెలుగుదేశంపార్టీ చంద్రబాబు నాయకుడు, జేడీయూ నితీష్‌కుమార్‌లు వ్యతిరేకించినా సరే ప్రధాని మోడీ జమిలీకి వెళ్లడానికే సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ ఇద్దరు నేతలు తమ మద్దతును ఉపసంహరించుకున్నా, ఎలాగూ ఎన్నికలకు వెళ్లాల్సిందే. అదేదో వారి నుంచి ఎలాంటి బెదిరింపు సంకేతాలు రాకముందే జమిలీకి వెళ్లడం వల్ల బిజేపికి లాభమని అనుకుంటున్నారు. ఇకపోతే ప్రతిపక్షాలు కూడా జమిలీ ఎన్నికలకు సిద్దంగా వున్నారు. జమిలీ ఎన్నికలు వద్దని ప్రతిపక్షాలు కూడా చెప్పడం లేదు. దాంతో జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందనే అనుకుంటున్నారు. అన్నీ అనుకుంటున్నట్లు జరిగితే 2027 నవంబర్‌లో జమిలీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగే అవకాశముంది.
