జైపూర్, నేటి ధాత్రి:
ఎన్నికలు సజావుగా జరుపుకోవాలని జైపూర్ ఎస్సై ఉపేందర్ రావ్ పౌనూర్ గ్రామవాసులను కోరారు. ఈసందర్భంగా గ్రామ వాసులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ఎవరికి సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు వారి పార్టీ గురించి ఏలాంటి విభేదాలు తలెత్తకుండా ప్రచారం చేసుకోవాలని ఏలాంటి అల్లర్లు జరిగిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతీ ఒక్కరూ ఎన్నికల నిభందనలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంగిచిన వారిపై సి, విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని,
ఎన్నికలకు సంబందించిన ర్యాలీలు, సభలు, వెహికల్ పర్మిషన్ లు, మైక్ పర్మిషన్ లకు సువిధ ఆప్, ద్వారా ఆన్లైన్ లో పర్మిషన్ తీసుకోవాలని, రూపాయలు 50,000/- ల కన్నా ఎక్కువ మొత్తంతో ప్రయాణం చేస్తే తగిన ఆధారాలతో కూడిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా జరగడానికి పోలిస్ వారికి సహకరించాలని కోరారు.