జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య
తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహ మే 30న పదవి విరమణ పొందడంతో ఇంచార్జి ఐజీగా బి.సైదయ్యను నియమిస్తూ జైళ్లశాఖ డీజీ ఎం.వినయ్‌కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సైదయ్య ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ జైళ్ల శాఖ డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో రాష్ట్రపతి అవార్డు ఎంపిక అయిన ఇతనికి జైళ్ల శాఖలో మంచి గుర్తింపు ఉంది.