
OBC branch
జై బాపు, జై భీం, జై సంవిధాన్ సభ ఘన విజయం
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు
శంకర్ పల్లి,నేటి ధాత్రి జూలై 5:
శుక్రవారం ఎల్బి స్టేడియంలో నిర్వహించిన “జై బాపు – జై భీం – జై సంవిధాన్” సభకు ప్రజలు భారీగా హాజరై సభను ఘనవిజయంతో ముగించేందుకు తోడ్పడినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నవాబుపేట మండల ఓబీసీ శాఖ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“సాంఘిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, యువతకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజ్యాంగ మూల్యాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ఈ సభ ఒక గొప్ప మాదిరిగా నిలిచింది” అని అన్నారు. సభ విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర వహించిన యువత సంఘాలు, స్థానిక నాయకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సభ అనంతరం ప్రజల్లో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించిందని పేర్కొన్నారు.