ఎల్బీ స్టేడియంలో నేడు ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ బహిరంగ సభ
సభను విజయవంతం చేద్దాం : భీమ్ భరత్
శంకర్పల్లి, నేటిధాత్రి:
ప్రజలందరినీ జాగృతం చేసేందుకు “జై బాపు, జై భీం, జై సంవిధాన్” పేరిట మానవ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణపై విస్తృత కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. జూలై 4న ఎల్బీ నగర్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ (AICC) జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసంగించనున్నట్లు భీమ్ భరత్ తెలిపారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులపై ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా సమానత్వం, హక్కుల పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మైనారిటీ సెల్ మహిళా అధ్యక్షులు, బీసీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో హాజరవ్వాలని భీమ్ భరత్ ఈ సందర్భంగా కోరారు.