తిరుపతి
రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్న హత్యలు గానే భావించాలి
అధికారం కోసం బాబాయిని చింపించిన వ్యక్తి జగన్ కు కార్యకర్తను చంపించడం పెద్ద విషయం కాదు
రవినాయుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు గారు మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే జీవించలేని పరిస్థితిలో ఉన్నాడని రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు కొట్టుకుంటే హత్యలు చేసుకుంటే ఎన్డీఏ కూటమికి అంట కట్టాలని చూస్తున్నారని సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఎపిలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో 1381 మందిని హత్య చేయించారని అప్పుడు రాష్ట్రపతి పాలన ఎందుకు అడగలేదని అసలు జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే ఒక్కరోజు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా నడిచిందని ఇప్పుడు రాష్ట్రపతి పాలన అడగడం సిగ్గుమాలిన చర్యలు ఆయన అన్నారు… ఎపిలో శాంతిభద్రతలు కరువయ్యాయని జగన్ చెప్పడం హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సామాన్య ప్రజలు రోడ్డుమీదికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని ప్రతిపక్షాలను రోడ్డు మీదకి ఎప్పుడు రాణించారో చెప్పాలని ప్రతిపక్ష నాయకుల పైన సామాన్య ప్రజల పైన ప్రశ్నించిన వారిపైన ఎన్ని వేల కేసులు పెట్టారో అందరికీ తెలుసని ఆయన అన్నారు ఎపిలో విధ్వంసం సృష్టించేది జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులేనని మళ్ళీ ఓదార్చేది జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి నీచపు రాజకీయ నాయకుడు చరిత్రలో చూడబోమని ఆయన అన్నారు.. గతంలో అధికారం కోసం సొంత బాబాయిని చంపేసి ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్యపై ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజైనా విచారణ చేయించారా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అలానే వైఎస్ఆర్సిపి కార్యకర్తలను హత్య చేపించి పరామర్శించడానికి వెళ్లినట్టు వెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు..
పల్నాడు ఘటనలో గొడవ పడింది ఇద్దరు వైసిపి కార్యకర్తలే చంపింది చచ్చింది ఇద్దరూ వైఎస్ఆర్సిపి వారు వైసిపి ఉపాధ్యక్షుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పి.ఎస్.ఖాన్ తో నిందితుడు జిలాని తిరిగాడు జిలానీ వైసిపి కార్యకర్త అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి దానికి ప్రభుత్వానికి ఏమి సంబంధం పల్నాడులో హత్య వెనుక ఉన్న వైసిపి ముఖ్య నేతలను వెంటనే అరెస్టు చేయాలి ..జగన్ హత్యారాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి వైసిపి కార్యకర్తలే జగన్ చేష్టలతో ఆశ్చర్యపోతున్నారు
40రోజుల ఎన్డీయే పాలనలో జగన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు పల్నాడుకు వెళుతున్న జగన్ కు ప్రభుత్వం బుల్లెట్ ఫ్రూఫ్ కారు కేటాయిస్తే కారు మరమ్మత్తులు గురైందని చెప్పడం సరైంది కాదు ప్రభుత్వం కేటాయించిన కారు ఎలాంటి మరమ్మత్తులకు గురికాలేదు ఓడిపోయిన తరువాత ప్రజల వద్దకు రావడమేంటి జగన్ చచ్చిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తూ నవ్వుతూ అవివాదం చేస్తూ వెళ్ళటం సిగ్గుగా అనిపించలేదా జగన్ చావుకు వెళ్తూ కూడా రాజకీయాలు చేస్తావా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది..ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తానని జగన్ చెప్పడం విడ్డూరం
ఎపిలో గంజాయి వైసిపి హయాంలోనే యదేచ్ఛగా దొరికింది గంజాయిని ప్రతి ఇంటికి నిత్యవసర సరుకులు లాగా సప్లై చేసింది వైఎస్ఆర్సిపి నాయకులే గతంలో గంజాయి రాష్ట్రంలో యదేచ్ఛగా దొరకడం వల్లనే యువత పక్కదారి పట్టారు దాన్ని ప్రక్షాళన చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పాలన చర్యలు మొదలుపెట్టింది 40 రోజుల్లో అనేక చర్యలు తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన స్మగ్లర్లు, గుండాలు ఇంకా గంజాయిని సప్లై చేస్తున్నారు వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం తథ్యం .. రాష్ట్రానికి చంద్రబాబు గారి పాలనలో పరిశ్రమలు రావడం మొదలుపెట్టాయి యువతకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు గారు నిరంతరం శ్రమిస్తున్నారు రాష్ట్రాన్ని బ్రస్ట్ పట్టించాలని జగన్మోహన్ రెడ్డి నిరంతర శ్రమిస్తున్నారు ఈ విషయం ప్రజలకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి అంతిమ ఘడియలు మొదలయ్యాయి నోరు అదుపులో పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు
సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి కార్యకర్తలను చంపి సింపతీ చూపించుకోవడం పెద్ద విషయం కాదని వైసిపి కార్యకర్తల్లారా జాగ్రత్తగా ఉండండి..వైసిపి పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి లేదంటే మిమ్మల్ని చంపి ఎన్ డి ఏ కూటమిపై నెట్టేస్తారు జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం..
ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షులు కృష్ణ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట వాసుదేవ్, నియోజకవర్గ అధ్యక్షులు కరణం సందీప్ ,రఫీ ,రంజిత్ నాయుడు, శ్రీరామ్ ,సంతోష్, లోకేష్ ,గోపి, శివ, నాగరాజా తదితరులు పాల్గొన్నారు.