భద్రాచలం నేటి ధాత్రి
సోమవారం నాడు భద్రాచలంలోని ఆదర్శనగర్ లో నిరుపేదలైన కుటుంబాలకు గృహ జ్యోతి జీరో విద్యుత్ బిల్లును తీసి వినియోగదారులకు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన కుటుంబాలకు గృహ జ్యోతి 200 యూనిట్ల లోపు జీరో కరెంటు బిల్లు మినహాయింపు ఉంటుందని ప్రకటించినందున నిరుపేదలైన కుటుంబాలు ఇష్టానుసారముగా విద్యుత్తును వృధా చేయకుండా వారికి అవసరానికి సరిపడా మాత్రమే విద్యుత్తును వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా మంచిగా పని చేసే మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన గృహ జ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకొని కరెంటును ఆదా చేసుకుంటూ అవసరమైనంతవరకే విద్యుత్తును వాడుకోవాలని ఆయన గృహిణులకు సూచించారు.
అనంతరం ఇండ్లలోని మీటర్లను పరిశీలించి మీటర్లు సక్రమంగా నడిచే విధంగా సంబంధిత విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని మీటర్లలో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేసి లేదా కొత్త మీటర్లను అమర్చి వాటిని ఏ విధంగా జాగ్రత్తపరుచుకోవాలో ఇంటి యజమానులకు తెలియజేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ,ఏపీవో పవర్ మునీర్ పాష, విద్యుత్ శాఖ ఏడిఈ వేణు, ఏ ఈ రాజారావు, లైన్ ఇన్స్పెక్టర్ సర్వేశ్వరరావు, లైన్మెన్ త్రినాథ్ రెడ్డి, స్పాట్ బిల్లర్ సుబ్రహ్మణ్యం ,తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది