సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్.

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం మండల కేంద్రం నందు బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని బి హరిచంద్ర నాయక్ అధ్యక్షతన భద్రాచలం ఐటిడిఏ గిరిభవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్, ఆర్డీవో ఎం మంగీలాల్, భద్రాచలం టౌన్ సిఐ రాయల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ గిరిజనులకు ప్రభుత్వం ఎల్లవేళల తోడు ఉంటుంది మరియు గిరిజనులు అధికారికంగా ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించు కోవడం చాలా సంతోషకరమని అన్నారు.

ఐ టి డి ఎ, పి ఓ ప్రతిక్ జైన్ మాట్లాడుతూ గిరిజనులకు ఎల్లప్పుడూ ఐటీడీఏ నుండి సహాయ సహకారాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు మరియు గిరిజనులకు ఎల్లప్పుడు తోడు ఉంటును అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి సందర్భంగా బంజారా సేవా సమితి భద్రాచలం ఆధ్వర్యంలో బోగ్ -బండారో కార్యక్రమం నిర్వహించినాము. బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అడుగుజాడలో నడవాలని, ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని, జాతీ ఐక్యత కోసం అందరూ పాటుపడాలని, పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని సాధువులు నిర్వహించిన బోగ్ బండారో కార్యక్రమంలో అధికారులు సేవాలాల్ మహారాజ్ ను భక్తిశ్రద్ధలతో ధ్యానిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించి, ప్రభుత్వానికి అధ్యక్షుడు బి హరి చందర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. భద్రాచలం శిశు మందిర్ విద్యార్థులు మరియు బిఈడి కళాశాల విద్యార్థులు బంజారాల సాంప్రదాయ నృత్యాలు తో అలరించారు,

ఈ కార్యక్రమానికి డిడి ట్రైబల్ వెల్ఫేర్ మనమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ ఏపిఓ డేవిడ్ రాజు, తాసిల్దార్ నాగేశ్వరావు, ఏటిడిఓ నరసింహారావు, ఆర్ ఐ వికులాల్ నాయక్, మరియు బంజారా సంఘ నాయకులు బి కృష్ణ నాయక్, బి బన్సులాల్, బి వీరు నాయక్ నాయక్, బి సైదులు నాయక్, జి భావసింగ్ నాయక్, బి తార చందు, భూక్య సాయి కౌశిక్, తూర్పాక సర్పంచ్ బి చందు నాయక్, పూజారి బి నాగేశ్వరావు, బిచ్చ నాయక్, బి జూమ్ లాల్, బి శిల్ప గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!