కమ్యూనిస్టుల పోరాట ఫలితమే తెలంగాణ విలీనం
సీపీఐ మండల కార్యదర్శి వాగబోయినా రమేష్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలలో భాగంగా గుండాల మండల కేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు బచ్చల లక్మినర్సు స్మరకస్థూపనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం రమేష్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం మాతృదేశ ,వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాటి నిజాం ప్రభుత్వంపై రైతాంగ సాయుద పోరాటాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబు తన ఆదీనంలో పెట్టుకుని హైదరాబాద్ ను ప్రత్యేక దేశంగా పాలన సాగించి దొరలు, దేశముట్లు, జమిందార్లు, జాగీర్దార్
లు, రజాకార్లతో పన్నుల రూపంలో ప్రజలను చిత్ర హింసలు చేస్తుంటే బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి,ఉగ్ధుల్ మోహినుద్దీన్ అనేక మంది కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి నిజాంకు వ్య తిరేక పోరాటాలు నిర్వహించి 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బికెఏంయూ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్ ,సనప చందు, మల్లెష్,అంజి, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.