6వ డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు
6వ డివిజన్ బిఆర్ఎస్వి నూతన కమిటీ నియామకం
హన్మకొండ, నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, దాస్యం వినయ భాస్కర్ గారి ఆదేశాల మేరకు బిఆర్ఎస్వి కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో 6,వ బి ఆర్ ఎస్ వి నూతన ఇంచార్జ్ గా మసూద్ పాషా సయ్యద్ మరియు ప్రెసిడెంట్ గా హరీష్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ చెన్నం మధు&బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి రాంబాబు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పలాలే మనల్ని గెలిపిస్తాయని, వినయ భాస్కర్ బడుగు ,బలహీన వర్గాల నాయకుడని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రాలలో లేవని, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని, కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన హామీలకు అక్కడి ప్రజలు తిరగబడుతున్నారని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి అబద్ధపు హామీలను ఇస్తున్నారని ,6గ్యారంటీలు కాదు, 60 గ్యారెంటీలు ఇచ్చిన కూడా కాంగ్రెస్ ను ఇక్కడి ప్రజలు ఎవరు నమ్మరని, వినయ భాస్కర్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించుకునే బాధ్యత మనదే అని, పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సుమన్ ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కపిలవాయి రాంబాబు, బిఅర్ఎస్వి నాయకులు పస్తం అనిల్, పిట్టల కళ్యాణ్,యూత్, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.