AIKS Condemns Cases on Farmers
కొనుగోలు సెంటర్ అడుగుతే అక్రమ కేసులు పెట్టడం సరికాదు
అఖిలభారత ఐక్య రైతు సంఘం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిదాత్రి:
కోమరారం లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్ పెట్టాలని అడుగుతే రైతులపై
అక్రమ కేసులు పెట్టడం నేరమని రైతే రాజనీ మొక్కజొన్నలకు కింటాకు 2400 కేటాయించి ఉంటే రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడి మొక్కజొన్న పంటను పండించి ఇవాళ వచ్చిన రేట్ కు అమ్ముకుందామంటే ఇల్లందు మండలంలో ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో వందల క్వింటాల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుంది కనుక
దళారులు వ్యాపారులు రైతులను అడ్డంగా కింటా మొక జొన్నలకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టి నిలువు దోపిడి జరుగుతా ఉంటే కొమరారంలో గవర్నమెంట్ మొక్కజొన్నల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని రైతులు కొమరారం రైతు వేదిక దగ్గర వ్యవసాయ శాఖ అధికారికి వినంతి పత్రం ఇవ్వడం కోసం ఎల్లితే రైతులపై అక్రమ కేసులు పెట్టడం.
ప్రజా పాలన ప్రభుత్వామన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అడుగుతే కేసులు పెట్టడం ఎడ్డూరంగా ఉందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంఘం అఖిలభారత ఐక్య రైతుసంఘం(ఏఐయుకేఎస్ )తెల్లం రాజు ఖండిచారు.
