35 ఏళ్లు వచ్చినా ఫిట్‌‌గా ఉండాలనుకుంటున్నారా.

35 ఏళ్లు వచ్చినా ఫిట్‌‌గా ఉండాలనుకుంటున్నారా. 

 

 

 

 

 

 

 

 

35 ఏళ్లు వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి కొన్ని రకాల జ్యూస్ లను తాగడం మంచిది. అయితే, ఫిట్‌‌గా ఉండటంతో పాటు యవ్వనంగా కనిపించడానికి వేటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

35 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి కొన్ని రకాల జ్యూస్ లను తాగడం మంచిది. ఎందుకంటే, వయసు పెరిగేకొద్ది శరీరంతోపాటు చర్మంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆరోగ్యకమైన ఆహారాలను తినడం చాలా అవసరం. ముఖ్యంగా పండ్లు, కూరగాయల జ్యూస్‌లు, కొన్ని రకాల విత్తనాలను తీసుకోవడం మంచిది. ఇవి మిమ్మల్ని హెల్తీగా ఉండేలా చేస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. కాబట్టి, ఫిట్‌‌గా ఉండటంతో పాటు యవ్వనంగా కనిపించడానికి వేటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

 

 

 

 

గ్రీన్ జ్యూస్:

ఆకుకూరలు, దోసకాయ, నిమ్మకాయ, అల్లం కలిపి చేసిన జ్యూస్ శరీరానికి చాలా అవసరమైన పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియకు, వికారం తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు వారానికి ఒకసారి ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

 

 

 

 

 

 

మునగాకు రసం

మునగాకు రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక పోషకాహారం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, ఎముకలను బలంగా చేస్తుంది. కాబట్టి, మీరు వారానికి 2-3 సార్లు ఈ మునగాకు పచ్చి రసం తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

బొప్పాయి రసం

బొప్పాయి అనేది ఒక రుచికరమైన, పోషకమైన పండు. ఇది విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీరు వారానికి 2 రోజులు బొప్పాయి తినండి. ఇది మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎండుద్రాక్ష, అంజీర్

ఎండుద్రాక్ష, అంజీర్ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. ఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంజీర్‌లో కూడా ఫైబర్, పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాత్రిపూట 4-5 ఎండుద్రాక్షలు, 2 అంజీర్ పండ్లను నానబెట్టండి. ఉదయం వాటిని తినండి. ఇది మీ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

 

 

విత్తనాలు

మీరు మీ ఆహారంలో విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. మీరు చియా గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విత్తనాలను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి మీ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.

 

 

 

 

 

 

జాగ్రత్తలు:

  • చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలను పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
  • మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, ఏదైనా జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!