హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ సామాజిక రచయితల సంఘం
రేగొండ,నేటిధాత్రి:
మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం అభినందనీయం అని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడి సతీశ్ రెడ్డి అన్నారు.తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు అయిన నరసింహరావు భారతరత్న దక్కడం పట్ల తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అన్నారు.మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కి భారత రత్న రావడం కూడా హర్షించదగ్గ విషయం అనీ, తాజాగా కేంద్ర భారత అత్యున్నత పౌర పురస్కారం పి.వి దక్కడం వారికి నిజమయిన నివాళి అని,వారి సంస్కరణలు ఇప్పటికీ అమలు కావడం గొప్ప విషయం అన్నారు.ప్రతీ రచయిత వారికి అవార్డ్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.