తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని గతంలో బాలు మల్లు పల్లి బస్వాపూర్ లో రైతులు పంట నష్టపోతే మీరు అధికారంలో ఉండి వారిని ఎప్పుడైనా పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నామని అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన సాగించారని సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో కుక్కల కొడుకా అని మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని దమ్ముంటే కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాట్లాడండి అని అధికారం పోయాక పద్మశాలిలపై కపట ప్రేమ చూపిస్తున్నారని అధికారంలో ఉన్నప్పుడు నేతలకు ఏ మేలు చేశారని ఫోన్ ట్యాపింగులతో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని ఇప్పటికే కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిందని కెసిఆర్ కు భయం పుట్టుకుందని అలాగే కెసిఆర్ ప్రతిపక్ష లీడర్గా హుందాగా వ్యవహరించాలనిప్రభుత్వంపై అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు