Eeshanvi Wins Wonder Memory Kid Award
వండర్ మెమొరీ కిట్ అవార్డు అందుకున్న ఈశాన్వీ
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాద్ లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన డాక్టర్ భీమగాని స్పందన గోపీచంద్ దంపతుల కుమార్తె ఈశాన్వీ కి వండర్ మెమోరీ కిడ్ అవార్డ్ కు ఎంపికైనారు అనంతరం వారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈశాన్వీ

తల్లిదండ్రులు మాట్లాడుతూ హైదరాబాదులో చిల్డ్రన్స్ డే సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో మా కూతురు ఈశాన్వీ కి వండర్ మెమొరీ కిడ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని ఉన్నంతమైన స్థానాలకు ఈశాన్వీ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
ఈ అవార్డు ప్రదానం చేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
