రావణుడి మృతదేహం ఇంకా భద్రంగా ఉందా?

ఆ గుహలో ఉన్న శవం దశకంఠుడిదేనా?

రామాయణ కాలంతో పాటు శ్రీరాముని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.
శ్రీరామునితో పాటు రావణుని గురించి అందరూ చర్చించుకుంటారు. నేటికీ రావణుడి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రావణుడి మృత దేహం గురించే చర్చ జరుగుతోంది.

శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం ప్రకారం.. రావణుడి మృతదేహాన్ని లంకలోని రాగాల అడవులలో 8 వేల అడుగుల ఎత్తులో ఒక గుహలో ఉంచారు. ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు ఉండటం వల్ల మనుషులు ఎవరూ కూడా ఇక్కడి రారు.

శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను కనుగొంది. రామాయణంలో కూడా ఈ ప్రదేశాల ప్రస్తావన ఉంది. వీటిలో ఒకటి శ్రీలంకలోని రాగల అడవి, దాని మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంది. ఇక్కడ రావణుడి మృతదేహాన్ని ఉంచినట్లు తెలిపారు.

రావణుడు తపస్సు చేసిన గుహ ఇక్కడే ఉందని చెబుతారు. నేటికీ అదే గుహలో రావణుడి దేహాన్ని భద్రంగా ఉంచబడిందని చెబుతారు. ఈ గుహ 8 వేల అడుగుల ఎత్తులో ఉంది. రావణుడి దేహాన్ని 17 అడుగుల పొడవైన శవపేటికలో ఉంచారు.

రావణుడి మృతదేహాన్ని మమ్మీ రూపంలో ఉంచినట్లు చెబుతారు. రావణుడు చనిపోయి 10 వేల సంవత్సరాలు గడిచినా చెడిపోని విధంగా మృతదేహాంపై లేపనాలు పూసినట్టు చెబుతున్నారు.

ఈ శవపేటిక కింద రావణుడి అమూల్యమైన నిధి ఉందని కూడా చెబుతారు. ఈ నిధి ఒక భయంకరమైన పాము, భయంకరమైన మృగంచే రక్షించబడిందని చెబుతారు.

రావణుడిని వధించిన తరువాత.. శ్రీరాముడు విభీషణుడికి మృతదేహాన్ని అప్పగించాడని స్థానిక ప్రజలు నమ్ముతారు. కానీ విభీషణుడు హడావుడిగా రావణుడి అంత్యక్రియలు నిర్వహించకుండా శరీరాన్ని అలాగే వదిలేశాడని వారు నమ్ముతారు.

రావణుడి మరణం క్షణికమైనదని.. అతను సజీవంగా తిరిగి వస్తాడని నమ్మినందున నాగవంశీకులైన ప్రజలు రావణుడి మృతదేహాన్ని తమతో తీసుకెళ్లారని వారు చెబుతున్నారు. అయితే.. కొందరు ఈ పుకార్లను కొట్టి పారేస్తున్నారు. పర్యాటక రంగాన్ని డెవలప్ చేసుకోవాడానికే లంక ఇలా ప్రచారం చేసిందని కొందరు నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!