ఊసరవెల్లి రాజకీయాలకు తెరపడనుందా?
ఉత్కంఠంగా మారిన రాజ్యసభ ఎన్నికలు?
`రాజ్యసభ ఎన్నికలో ట్విస్ట్ లే ట్విస్టులు!
`రాజకీయ రంగులు తేలిపోనున్నాయా?
`ఏ పార్టీ పొత్తు ఎవరితో తెలనుందా?
`పది మంది ఎమ్మెల్యే లు పదవులు పోయే సమయం ఆసన్నమైందా?
`కేసీఆర్ విప్ జారీ చేస్తారా! రాజకీయ వ్యూహం రచిస్తారా?
`కేసీఆర్ విప్ జారీ చేస్తే పరిస్థితి ఏమిటి?
`పార్టీ మారిన ఎమ్మెల్యే లు పదవులు కాపాడుకుంటారా?
`విప్ కు విరుద్దంగా ఓటేసి సభ్యత్వాలు కోల్పోతారా?
`ఇప్పుడున్న ఎమ్మెల్యే ల సంఖ్యా బలం కాంగ్రెస్ కు సరిపోదు.
`పార్టీ మారిన ఎమ్మెల్యే లు ఓట్లేసినా కాంగ్రెస్ రెండు సీట్లు గెలవలేదు.
`కేసీఆర్ దైర్యం చేసి ఒక సీటుకు పోటీ పెడతారా?
`పార్టీ మారిన పది మంది కాంగ్రెస్ కు చేయిచ్చి బి ఆర్ ఎస్ కు ఓటేస్తారా?
`వాళ్ళు కూడా గైర్హాజరుతారా?
`ఆలా చేసినా విప్ దిక్కారమే అవుతుంది?
`పది మంది ఎమ్మెల్యే లకు ముందు నుయ్యి వెనుక గొయ్యి కానుందా?
`అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకుంటారా?
`ఏక కాలంలో పది మంది కి అనారోగ్యం సాధ్యమౌతుందా?
`అనేక చిక్కు ముడులలో రాజ్యసభ ఎన్నిక ప్రక్రియ?
`గొప్యతకు తావులేదు… తప్పించుకునే ఛాన్స్ లేదు!
`కాంగ్రెస్ బలం 66
`సిపిఐ పార్టీకి ఒక్క సీటు వుంది.
`ఒక్క రాజ్య సభ గెలుపుకు 41 మంది ఎమ్మెల్యే లు అవసరం!
`10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యే లు కలిస్తే 77 అవుతుంది.
`రెండు సీట్లు గెలుచుకోవాలంటే 82 ఓట్లు కావాలి.
`కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తే లెక్క సరిపోతుంది?
`పార్టీ మారిన ఎమ్మెల్యే లు ఓట్లేస్తేనే సాధ్యమౌతుంది?
`పది మంది జారుకుంటే మొదటికే మోసం వస్తుంది?
`సీఎం రేవంత్ రెడ్డి ని నమ్ముకొని ఓటేస్తారా?
`పదవులు పోయినా సరే అని విప్ దిక్కరిస్తారా?
`పదవులు కాపాడుకోవడమే మేలనుకుంటారా?
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ సొంతం కానున్నాయా? ఈ రెండు సీట్లు సాధించుకోవడం సాధ్యమా? కాంగ్రెస్‌కు సంఖ్యా బలం సరిపోతుందా? మిత్రులు కలిసి వచ్చినా రెండు రాజ్యసభ గెల్చుకునే అవకాశం వుందా? అంటే స్పష్టమైన సమాదానం ఎవరూ చెప్పలేరు. ఆఖరు నిమిషం వరకు చెప్పడానికి అవకాశమే లేదు. రెండు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవంగా సాధించుకునే ఎమ్మెల్యేల కాంగ్రెస్‌కు లేదు. అలాగని కనీసం ఒక్క సీటు పొందేందుకు కూడా బిఆరఎస్ బలం సరిపోదు. మరి ఎలా? అనే ప్రశ్నలు అనేకం ఉత్పన్నమౌతున్నాయి. ఇప్ప్పుడే రాజకీయాల అసలు రంగు బైటపడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు బిఆరఎస్ అవకాశం కల్పించినా బిజేపి చేసే ఆరోపణలకు బలం చేకూరుతుంది. బిఆరఎస్‌కు బిజేపి సహకరించినా కాంగ్రెస్ విమర్శలు నిజమని ఒప్ప్పుకున్నట్లౌవుంది. ఒక వేళ కాంగ్రెస్, బిజేపిలు లోపాయి కారి ఒప్పందాలు జరుపుకునే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో సాద్యమే కాదు. ఏ రకంగా చూసిన పాలకపక్షం కాంగ్రెస్ రెండు సీట్లు కైవసం చేసుకోలేదు. ప్రతిపక్ష బిఆరఎస్‌కు ఒక్క సీటు దక్కేందుకు ఆస్కారం లేదు. కాని పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు, బిజేపి కలిస్తే బిఆరఎస్ ఒక్క సీటు సాధ్యమే? కాని ఇది కూడా సాధ్యమయ్యే పని అసలే కాదు. మరి కాంగ్రెస్ ఎలా రెండు సీట్లు సాదిస్తుంది. ఒక వేళ బిజేపి పోలింగ్‌కు గౌర్హాజరైనా సరే కాంగ్రెస్‌కు రెండు సీట్లు దక్కేలా కనిపించడం లేదు. కాని పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మాత్రం కచ్చితంగా రెండు సీట్లు దక్కడానికి ఇబ్బందేమీ లేదు. అయినా అది కూడా సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా వుంది. బిఆరఎస్ వేసే అడుగుýతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇరుక్కుపోయేది మాత్రం కేవలం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలే కీలకం. కాకపోతే మరో ఉపద్రవం ముందు రానున్నది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ మార్చి 16. ఇంకా చాలా సమయం వుంది. కాని ఈ లోపు సుప్రింకోర్టులో పిరాయింపు ఎమ్మెల్యేల తీర్పు ఎలా వచ్చినా వారికి రాజ్యసభ ఎన్నికల రూపంలో ముప్ప్పు కనిపిస్తూనే వుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే పిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితేనే కాంగ్రెస్‌కు లాభం. ఏ బుజ్జగింపులతో పని వుండదు. సుప్రింకోర్టు అనర్హత వేటు వేయకుండా మరో వాయిదా ఇచ్చినా కాంగ్రెస్‌కు లాభమే? కాని ఎటు చూసినా పిరాయింపు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి కావడం మాత్రం ఖాయం. ఇప్ప్పుడు అసలైన రాజకీయం మొందలౌతుంది. రాజ్యసభ ఎన్నికల్లో బిఆరఎస్ గెలవకపోయినా ఒక అభ్యర్దిని నిలబెడితే మాత్రం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్దితి ఆగమ్య గోచరమే? ఎన్నికలకు దూరంగా వుండేందుకు బిఆరఎస్ నిర్ణయం తీసుకుంటే అది పరోక్షంగా కాంగ్రెస్‌కు మేలు జరుగుతుంది. అప్ప్పుడు కాంగ్రెస్, బిఆరఎస్ చేస్తున్న రాజకీయాలపై బిజేపికి అస్త్రం దొరుకుతుంది. బిఆరఎస్, కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల మూలంగానే రాజకీయ లలాటం జరగుతుందని తేలిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా, అన్ని పార్టీలకు పితలాటకమే. ఇలాంటి సందిర్ఘ పరిస్ధితి గతంలో ఎప్ప్పుడూ లేదు. ఇక్కడ కాంగ్రెస్, బిఆరఎస్లు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందే…ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఇబ్బందే? ఇది విచిత్రమైన రాజకీయ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చే అవకాశం వుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆరఎస్ పోటీ చేయనప్ప్పుడు, బిజేపికి సపోర్టు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నది. దేవనపల్లి కవిత చెబుతున్న మాట నిజమౌతుంది. కాంగ్రెస్‌కు సపోర్టు చేసేలా ఎన్నికల బరి నుంచి తప్ప్పుకుంటే కాంగ్రెస్ గెలుపుకు రాజ్యసభలో బిఆరఎస్ సహకరిస్తున్నట్లౌవుతుంది. ఏ రకంగా చూసినా ఇక్కడ బిఆరఎస్ కూడా ఇబ్బందికరమే అవుతుంది. ఇప్ప్పుడు కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు రచించాల్సిన అసవరం లేదు. ఒకటి మాత్రం పక్కా గెల్చుకుంటుంది. పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు సహకరిస్తే రెండో సీటు కూడా కైవసం చేసుకుంటుంది. ఇప్ప్పుడు కేసిఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కాకపోతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు పదవీ త్యాగానికి సిద్దపడాలి. ఏ రకంగా చూసిన వారికి ముందు ముప్పు వున్నట్లే లెక్క. పదవి పోవడం ఖాయంగానే పక్కా!! ఏది జరిగితే అది జరుగుతుందని ఆ పది మంది ఓటు వేస్తారా? అనర్హత వేటు పడినా సరే అని దైర్యం చేస్తారా? సిఎం. రేవంత్‌రెడ్డిని నమ్ముతారా? ఈ విషయంలో సిఎం. రేవంత్‌రెడ్డే కాదు, బ్రహ్మదేవుడు కూడా పిరాయింపు ఎమ్మెల్యేలను ఎవరూ కాపాడలేరు. బిఆరఎస్ పార్టీ విప్ దిక్కరిస్తే పది మంది పదవులు పోవడం అనేది ఖాయం. అప్ప్పుడు మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేస్తారా? పదవులు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ టికెట్ ఇస్తుందన్న నమ్మకం లేదు. అలాగని అందులోనూ కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేస్తారన్న నమ్మకం కూడా లేదు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎట్టిపరిస్దితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆరఎస్ అభ్యర్ధులను గెలిపించారు. ఆయన విప్‌ను అనుసరిస్తే ఆయన పదవి పోదు. కాకపోతే ఇప్పట్లో బిఆరఎస్ చేరదీయదు. కాని ఎమ్మెల్యే పదవి మాత్రం కాపాడుకున్నట్లౌవుంది. అలా పార్టీన వారిలో ఓ నలుగురు విప్‌కు అనుగుణంగా వెళ్లినా కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచే అవకాశం మళ్లీ మొదటికి వస్తుంది. అంతెందుకు ఎమ్మెల్యే పదవులు కాపాడుకోవాలంటే విప్‌ను అనుసరించాలి. కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా వుండాలి. అప్ప్పుడు ఎమ్మెల్యే పదవులు పోవు. కాని కాంగ్రెస్‌కు దూరమౌతారు. అటు, ఇటు ఎటు కాకుండా పోతారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా బిఆరఎస్ విప్‌ను అనుసరిస్తే మరు నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారిని దూరం పెడతారు. పార్టీ కార్యక్రమాలను హజరు కానివ్వరు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నాయకులే ఆ ఎమ్మెల్యేలను తరిమి కొడతారు. ఇప్పటికే జగిత్యాల, పటాన్ చెరువు నియోజకవర్గాలలో చూస్తూనే వున్నాయి. అది పది మందిఎమ్మెల్యేలు ఎదుర్కొవాల్సి వుంటుంది. సహజంగా అదికార పార్టీకి సంఖ్యాబలం పూర్తిగా వుంటేనే ఏకగ్రీవం అవుతారు. లేకుంటే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లకు అవసరమైన సంఖ్యా బలం లేదు. సిఎం. రేవంత్ రెడ్డి రెండు సీట్లకు అభ్యర్దులను నిలబెడతామంటున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సీటుకు కాంగ్రెస్ అదిష్టానం సూచించిన అభిషేక్ సింగ్వీ పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. రెండో దానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఉప రాష్ట్ర పదవికి పోటీ చేసిన జస్టిస్. సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేస్తారని అంటున్నారు. గతంలో ఉప రాష్ట్రపతిగా పోటీ చేసినప్ప్పుడే సంఖ్యాబలం లేకున్నా నిలుచున్నారు. ఇప్ప్పుడు కూడా అదే పరిస్ధితి వుంది. అయినా ఆయన దైర్యం చేస్తారా? అన్నది కూడా ముఖ్యమైపోయింది. అనవసరంగా ప్రతిష్టకు కాంగ్రెస్ పోతుందా? అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఒక్క రాజ్యసభ సీటు కోసం పది మంది ఎమ్మెల్యేల పదవిని బలి చేస్తారా? అని కూడా అనుకుంటున్నారు. ఎలాగూ సుప్రింకోర్టు వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నప్ప్పుడు విప్ దిక్కరించి ఓటు వేయడం మేలనుకుంటున్నారా? అది కాంగ్రెస్ నిర్ణయమా? లేక పార్టీ మారిన పది మంది ఒప్ప్పుకుంటారా? ఇలా రకరకాల చిక్కు ముడులు వున్నాయి. ఇప్ప్పుడు బిఆరఎస్ విప్‌ను అసుసరించినా మళ్లీ బిఆరఎస్ తీసుకునే అవకాశం లేదు. అందులోకి వెళ్లేందుకు దారి లేదు. కేసిఆర్ క్షమిస్తారన్న నమ్మకం లేదు. ఎటు చూసినా గందరగోళమే కనిపిస్తోంది. ఒక వేళ బిజేపి విప్ జారీ చేయకపోతే పరిస్దితి ఎలా వుంటుందో అనే చర్చ కూడా సాగుతోంది. కేంద్రంలో అదికారంలో వున్న బిజేపి విప్ జారీ చేయకపోయినా, గౌర్హాజరైనా సరే ఎంతో కొంత కాంగ్రెస్‌కు మేలు చేసినట్లే…అవుతుంది. ఇలాంటి చిత్రమైన రాజకీయం ఎప్ప్పుడూ రాలేదు.
