
Kantha Maheshwara Bonalu Invitation
మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి,రేణుల ఏళ్ళమ్మతల్లి బోనాల ఉత్సవాలు వచ్చే అక్టోబర్ 4 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నామని దీనికి ప్రతి ఒక్క గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలిరావాలని పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ నేపథ్యంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ను గౌడ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.అలాగే బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ దాత సోల్తి సారయ్య గౌడ్ కు, నర్సంపేట డివిజన్ గౌడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ కు ఆహ్వాన పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇదేండ్లకోసారి కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు నర్సంపేట పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.దీనిలో భాగంగా పట్టణంలోని ప్రతి గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలి రావాలని కోరారు. దీనికోసం ప్రజలందరినీ సమాయత్తం కోసం సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కమిషనర్ భాస్కర్ ను కోరారు. అనంతరం కమిషనర్ భాస్కర్ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి వచ్చి సౌకర్యాల ఏర్పాటుపై పరిశీలన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, నాతి సదానందం గౌడ్, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్ సురేష్ గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్, మండ వీరన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.