జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పదవ తరగతి బ్యాచ్ 2002-2003 అక్టోబర్ 6 తేదీ ఆదివారం రోజున జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా కనుల పండగ అత్యంత వైభవంగా జరుపుటకు విద్యార్థులందరికీ ఆహ్వానం తెలుపడం జరుగుతుంది.20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరపడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని,కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకుంటూ ఉపాధ్యాయులతో ఆనాటి జ్ఞాపకాలను పంచుకోవడానికి ఒక వేదికను అలంకరించుకోవడం జరుగుతుంది.