ఇంటింటికి నల్లా కనెక్షన్
హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పిస్తామని క్యూసి ఎఇ రాములు తెలిపారు. శుక్రవారం మండలంలోని జయగిరి గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఎఇ రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబం నల్లా కనెక్షన్ తీసుకోవాలన్నారు. అక్రమాలు జరగకుండా ఉండాలని పైపులు వేసిన పనితీరును అడిగి తెలుసుకున్నారు. నల్లాకు బిగించిన ఆన్, ఆప్‌లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ ఇ.సునీత, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ ఇ.అంజు, గ్రామ సర్పంచ్ బొల్లవేని రాణి, రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ బుర్ర శ్రీధర్, వార్డుసభ్యుడు యాటకాల సదానందం తదితరులు పాల్గొన్నారు.