నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నేతల ఆత్మీయ సమ్మేళనం
జైపూర్,నేటి ధాత్రి:
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జై బాపు – జై భీమ్ -జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఐఎన్టియుసి నేతలు పిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులంతా పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.ఐఎన్టియుసి రాష్ట్ర నేత,తెలంగాణ ప్రభుత్వ మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ జైపూర్ లో మీడియాతో ఈసందర్భంగా మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రాధాన్యత ఉంది.కానీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా అవసరం. జూలై 4న జరిగే ఈ సభలో కాంగ్రెస్ పార్టీని నమ్మి నిస్వార్థంగా పని చేస్తున్న నాయకులకు అర్థవంతమైన ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.సెంట్రల్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు,పార్టీలోని అందరూ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈసమావేశంలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే పార్టీ శ్రేణుల మద్దతును సమీకరించుకునే గొప్ప అవకాశం అని తెలిపారు.అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు,ఐఎన్టియుసి మిత్రులు అందరు కూడా తప్పకుండా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.