ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో మహిళా సాధికారిత విభాగం,అలాగే కస్తూరిబాయి మహిళా మండలి సౌజన్యంతో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా నర్సంపేట ప్రముఖ గైనకాజిస్ట్ డాక్టర్ పి.భారతి,

సీడీపీఓ-ఐసిడిఎస్-కె.మధురిమ,
కస్తూరిబాయి మహిళా మండలి అధ్యకురాలు జి. అరుణ,
ప్రతేక్యఅతిధి మల్లం పద్మ,అంగన్వాడీ
యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. భారతి పాల్గొన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్
ప్రొఫెసర్ మల్లం నవీన్ మట్లాడుతూ సమాజంలో ఒక్క మహిళను బలపరిస్తే ఆమె తన కుటంబాన్ని బలపరుస్తూ సమాజాభివృధి,
తద్వారా దేశ అభివృధికి పాటుపడుతుందని పేర్కొన్నారు.
గైనకాజిస్ట్ డాక్టర్ పి.భారతి మాట్లాడుతూ స్త్రీలు ప్రధానంగా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలకు కొన్ని ఆచరణాత్మక సూచనలు చేస్తూ, క్యాన్సర్ నివారణకు హెచ్పివి వాక్సిన్ యొక్క ఆవశ్యకతను వివరించారు.నేడు మహిళలు వివిధ రంగాలలో ముందడుగు వేస్తున్నారంటే అందుకు కారణం వారి పోరాటాల వెనుక నిలబడిన ఎందరో మహిళామణులు చేసిన శ్రమ ఫలితం అని ఐసిడిఎస్ సీడీపీఓ కె.మధురిమ పేర్కొన్నారు.మహిళా సాధికారిత విభాగం అధ్యక్షురాలు ఎస్.రజిత మాట్లాడుతూ మహిళకు భద్రత,ఆరోగ్య సంరక్షణను పెంపొందిచడంతో పటు మహిళా సాధికారిత ద్వారా స్వతంత్ర నిర్ణయాలను తీసుకొనే వాతావరణం కల్పించాలని అన్నారు.

కస్తూరిబాయి మహిళామండలి అధ్యకురాలు జి. అరుణ ఇల్లాలి చదువే ఇంటికి వెలుగు అని స్త్రీ విద్య ఆవశ్యకతను వివరించారు. నల్లా భారతి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రకృతిలో లభించే పౌష్ఠిక ఆహారం వివరాలను తెలియజేశారు.అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను ప్రదానం చేసారు.ఈకార్యక్రమంలో మహిళా సాధికారిత విభాగం సభ్యులు ఆర్.రుద్రాణి, డాక్టర్.బి.గాయత్రి,ఏ.వో, జి.అనిత, గ్లోరీ, మాధవి,భార్గవి,లక్ష్మి, కస్తూరిబాయి మహిళామండలి బాద్యులు,అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు,అధ్యాపకులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.