
_ప్రతి విద్యార్థి ఆలస్యం కాకుండా హాజరు కావాలి
_పరీక్షల చీఫ్ సూపర్డెంట్ జి మల్లేశ్
చందుర్తి, నేటిధాత్రి:
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుండి మార్చి 14 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడునని చీఫ్ సూపర్డెంట్ కళాశాల ప్రిన్సిపాల్ జి మల్లేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరానికి 81 మంది విద్యార్థులు , ద్వితీయ సంవత్సరానికి 107 మంది విద్యార్థులు మొత్తం పరీక్ష కేంద్రంలో188 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడునని కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రంలో హాజరుకావాలని ఆలస్యమైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించబడదని పరీక్ష కేంద్రానికి ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబోమని పరీక్ష కేంద్రంలో నీటి సౌకర్యం, వైద్యశాల ఏర్పాటు చేశామన్నారు హాజరవు ప్రతి విద్యార్థి భయపడాల్సిన అవసరం లేదని ప్రశాంత వాతావరణంలో పరీక్షలుకు రాయాలన్నారు. పరీక్షా కేంద్రంలో ఏరియాలో 144 సెక్షన్ అమలవుతుందన్నారు. డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా బి ప్రవీణ్ కుమార్ పిదులు నిర్వహిస్తున్నారన్నారు