మావోయిస్టు యాక్షన్ టీంకు చెందిన ఎలాంటి సమాచారమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి -ఎస్సై రవికుమార్
మంగపేట, నేటిధాత్రి
అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం, మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికల సమాచారంతో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు ఫెర్రీ పాయింట్ల (నావ రేవుల) వద్ద పోలీసులు ఇవాళ ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఆధ్వర్యంలో మండలంలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్, మంగపేట పుష్కర్ ఘాట్, మల్లూరు, చుంచుపల్లి, రాజుపేట, అకినేపల్లి మల్లారం తదితర గోదావరి పరివాహక ప్రాంతాలు, ఫెర్రీ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు యాక్షన్ టీంకు చెందిన ఎలాంటి సమాచారమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని రేవుల వద్ద నావల (పడవల) నిర్వాహకులకు, గోదావరి నదిలో చేపలు పట్టే జాలర్లకు పోలీసులు సూచించారు.