మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత

నర్సంపేట నేటిధాత్రి :

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర చిన్న సూరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషులకు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా భీమా డబ్బులను అందజేశారు. సామూహిక సహాయం నుండి రూపాయలు 60 వేలు, ఆభయానిధి పథకం నుండి రూ.10 వేలు, మొత్తం 70 వేల రూపాయలు మృతుని భార్య శ్యామల, కుమారుడు రంజిత్ లకు అందజేసినట్లు అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి మృత్యుంజయుడు, పాలకవర్గ సభ్యులు బానోతు రమేష్, భాషబోయిన రాజు, సలపాల ప్రభాకర్, ఉప్పుల రాజు, పాక రాజన్న, మామిడి ఐలయ్య, బానోతు సాంబయ్య, తంగళ్ళపల్లి గణేష్, ఆజ్మీర జితేందర్ సంఘ ఘనకులు ఏడెల్లి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!