రుద్రంగి పరిధిలోని క్రిటికల్ ,నర్మల్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ

*మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్సు టీం చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ

రుద్రంగి, నేటిధాత్రి:


రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల, బడి తండా, మెగావత్ తండా,రుద్రంగి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రహరీ గోడ,సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగునవి ఉండేలా చూడాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

*ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ

త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు తమయెక్క ఓటు ప్రశాంత వాతవరంలో వినియెగించుకునేల పోలీస్ శాఖ తరపున పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని, జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసి సీసీ కెమెరాల ఏర్పాటు,ఎన్నికల సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ,అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.ఎన్నికల దృష్ట్యా జిల్లాకి 200 మంది బి ఎస్ ఎఫ్ సాయుధ బలగాలు రావడం జరిగిందని,జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకునేల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిదన్నారు.ఎన్నికల నియమావళి పాటిస్తూ పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ అన్నారు అనంతరం మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్సు టీం చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. అనంతరం మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్సు టీం ఆధ్వర్యంలో గల చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఏ వాహనాన్ని విడిచిపెట్టకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్రమ మద్యం ,నగదు, ప్రజలను ప్రలోబపరిచే వస్తువుల రవాణాకు ఆడ్డుకట్ట వేయాలని అన్నారు.ప్రజలకు విజ్ఞప్తి ప్రయాణ సమయంలో యాబై వేళా కంటే ఎక్కువ నగదు వెంట తీసుకపోవద్దు అని,ఒకవేళ తీసుక వెళ్తే వాటికి సబందించిన పత్రాలు వెంట వుండాలని అన్నారు.

ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచరి, సి.ఐ కిరణ్ కూమార్, ఎస్.ఐ రాజేష్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *