చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలురుల అద్దె వసతి గృహాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఇంఛార్జి అధికారి వినోద్ కుమార్ శనివారం తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని రికార్డులను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ వసతి గృహం శిథిలవస్థకు చేరగా జిల్లా అధికారులకు వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఇంఛార్జి అధికారి వినోద్ కుమార్ వసతి గృహాన్ని పరిశీలించారు. శిథిలమైన వసతి గృహాన్ని మార్పించేందుకు మరో అద్దె వసతి గృహాన్ని వినోద్ కుమార్ పరిశీలించారు. అద్దె వసతి గృహానికి యజమాని అనుమతించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమ అధికారి రవీంద్ర స్వామి, చందుర్తి ఎంపీటీసీ సభ్యురాలు పులి రేణుక సత్యం గౌడ్, మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, వసతిగృహం సిబ్బంది పాల్గొన్నారు.