పుర కమిషనర్ ఎన్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, మార్చ్02, నేటిధాత్రి:
2022- 23 ఆర్థిక సంవత్సరపు ఆస్తి పన్నులు బకాయిలు ఉన్నచో మునిసిపాలిటీకి చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పుర ప్రజలకు మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును 100శాతం ఫెనాల్టిలో 90 శాతం మాఫీ చేసిందని అన్నారు. 10 శాతం పెనాల్టీతో ఒకేసారి ఆస్తి పన్నును చెల్లించే సదవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.2023-24 కు సంబంధించిన ఆస్తి పన్నును ఈనెల 31 లోపు చెల్లించాలని, లేనట్లయితే తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం ప్రతినెల 2 శాతం పెనాల్టీతో చెల్లించవలసి వస్తుందని, పుర ప్రజల గమనించి ఆస్తి పన్నును చెల్లించి మునిసిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆస్తి పన్ను చెల్లింపు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ఆన్ లైన్ ద్వారా లేదా మునిసిపాలిటీ కార్యాలయంలో ఈనెల 31 లోపు ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో రెవెన్యూ రీ డ్రేస్సల్ మేళా నందు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.