
SERT team
ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన ఎస్ ఇ ఆర్ టి బృందం..
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ చిట్యాల పాఠశాలలో మంగళవారం రోజున ఎస్ సి ఇ ఆర్ టి పరిశీలకు లు శ్రీ రాంబాబు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కె లక్ష్మణ్ పలు రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్,సమ్మెటివ్ అసెస్మెంట్, టీచర్ డైరీలు, విద్యార్థుల పర్ఫామెన్స్ కు సంబంధించి ఎల్ఐ పి బేస్ లైన్ టెస్ట్, మిడ్లైన్ టెస్ట్ సంబంధించిన రికార్డులు, ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ రిజల్ట్,యాక్షన్ ప్లాన్,ఎస్ఎస్సి గ్రేడింగ్ రిజిస్టర్లు పరిశీలించారు. అంతేకాకుండా విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి విద్యాసామర్ధ్యాలు పెంపొందించే కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడపాక రఘుపతి ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి ఉపాధ్యాయులు శ్రీ బొమ్మ రాజమౌళి, బుర్రసదయ్య,సాంబారు రామనారాయణ,ఉస్మాన్ ఆలీ,శంకర్, శ్రీనివాస్, నీలిమారెడ్డి, సరలా దేవి, విజయలక్ష్మి, కల్పన,సుజాత,మౌనిక, మరియు సి ఆర్ పి రాజు తదితరులు పాల్గొన్నారు.