జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి.

Colleges. Colleges.

జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం కనీస మౌలిక సదుపాయాలు కల్పనపై విద్యా, టిజిడబ్ల్యూఐడిసి ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనకు జిల్లాలోని 5 జూనియర్ కళాశాలలకు 41.07 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇట్టి నిధులతో
మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. ఈ నిధులతో సివిల్ మరమ్మతులు, ఎలక్ట్రికల్, మంచినీరు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి సదుపాయాలపై ఫోకస్ చేయాలని, ఇట్టి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న డీఈఓ రాజేందర్ టీజడబ్ల్యూఐడిసి డిఈ రామకృష్ణ ఏఈ మహేందర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!