ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.