ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి.

Collector Collector

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

బుధవారం భూపాలపల్లి రూరల్ మండలంలోని ఎస్‌.ఎన్‌.కొత్తపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు జంగా రాణి, నాలుక రామ్మూర్తి, తరగంప కరుణలత ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తి చేశారు, ఏవైనా సాంకేతిక లేదా సామగ్రి సంబంధిత సమస్యలున్నాయా?, ఇసుక ఎక్కడి నుండి తీసుకుంటున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. మండలంలోని కాల్వపల్లి వద్ద ఉన్న ఇసుక స్టాక్‌పాయింట్ నుండి ఇసుక అందుబాటులో ఉందని, లబ్ధిదారులు అక్కడినుండే తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇంటి నిర్మాణం పనులను దశలవారీగా పూర్తి చేస్తూ సంబంధిత ఫోటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణం నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. వర్షాలు వల్ల మురుగు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని సూచించారు. ప్రతి కుటుంబం తప్పని సరిగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు వ్యాప్తి జరుగకుండా నియంత్రణ చర్యలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, ఎంపిడిఓ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!