Ward Members Training Concludes
వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగింపు
దుగ్గొండి నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని వార్డు సభ్యుల కోసం నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల పనితీరు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగం, పారిశుధ్యం, అభివృద్ధి ప్రణాళికలపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,మండల పంచాయతీ అధికారి ఎం. శ్రీధర్ గౌడ్, ట్రైనింగ్ టిఓటి లు ఎం. నరేష్ రాజు పాల్గొని శిక్షణ ఇచ్చారు. మండలంలోని వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందారు.
ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులు సూచించారు.
