లక్ష్మారెడ్డి పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ_
* పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళ మణులు
* సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మిరెడ్డి పల్లె గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మంజూరైన చీరలను లబ్ధిదారులకు వారు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజయ అశోక్ రెడ్డి,గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._
