‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు’
‘పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం’
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
మహబూబ్ నగర్/నేటి ధాత్రి

అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అంతకుముందు పాలమూరు యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, మేఘా రెడ్డి, కుర్వ తిరుపతయ్య, గూడెం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.